Begin typing your search above and press return to search.

రంజన్ రొమాన్స్ రూల్స్.. కెమిస్ట్రీ కేక

ఈ సినిమాని అక్టోబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

By:  Tupaki Desk   |   12 Sep 2023 6:09 AM GMT
రంజన్ రొమాన్స్ రూల్స్.. కెమిస్ట్రీ కేక
X

యంగ్, టాలెంటెడ్ టాలీవుడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ ఉంటారు. తాను ఎంచుకునే కథలు కూడా అలానే ఉంటాయి. తనకు సూట్ అయ్యేలా సంపుల్ కథలతో వస్తూ ఉంటాడు. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రూల్స్ రంజన్. ఈ మూవీ ట్రైలర్ ఇటీవల విడుదల చేయగా, చాలా ఫన్నీగా సాగింది. కాగా, ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా విడుదల తేదీని కన్ఫామ్ చేస్తూ, ఓ పోస్టర్ విడుదల చేశారు.



ఈ సినిమాని అక్టోబర్ 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి పెయిర్ చాలా అందంగా ఉంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలో నేహా బంగారు రంగు లెహంగా, జాకెట్ ధరించారు. జ్యూవెలరీ కూడా దానికి తగినట్లే ముస్తాబయ్యారు. ఇక, కిరణ్ ఎప్పటి లాగానే సింపుల్ గా క్యాజువల్స్ ధరించారు.

ఇక, ఈ సినిమాకి రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. . స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే మూవీలో పాటలు బాగా క్లిక్ అయ్యాయి. ముఖ్యంగా సమ్మోహనుడా పాట అయితే, అందరి ఆల్ టైమ్ ఫేవరేట్ గా మారడం విశేషం.

ఇదిలా ఉండగా, ఈ మూవీలో సరికొత్త కిరణ్ అబ్బవరం కనిపిస్తాడని చిత్ర బృందం చెబుతోంది. మూవీ లో మంచి ప్రేమ కథతో పాటు, ఆకట్టుకునే కథ కూడా ఉంటుందని, ప్రేక్షకులు మనసారా నవ్వుకునేలా, మంచి ఎంటర్ టైన్మెంట్ అవుతుందని మూవీ టీమ్ ధీమా గా ఉంది.

ఇక, కిరణ్ అబ్బవరం రాజావారు, రాణివారు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. మొదటి సినిమాలు చాలా అమాయకంగా కనిపించిన కిరణ్, రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంతో అదరగొట్టాడు. ఇక, అప్పటి నుంచి వరసగా అవకాశాలు అందుకుంటున్నాడు. మధ్యలో కొన్ని ప్లాప్ లు పరిచయం అయినా, ఈ మూవీతో మళ్లీ హిట్ కొట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక, నేహా శెట్టి కూడా డీజే టిల్లు తర్వాత ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది.