Begin typing your search above and press return to search.

రూల్స్ రంజన్ భయపడ్డాడు

ఈ యువ కథానాయకుడు నటించిన కొత్త సినిమా 'రూల్స్ రంజన్'కు ఒక దశలో మినిమం బజ్ కనిపించలేదు.

By:  Tupaki Desk   |   12 Sep 2023 8:55 AM GMT
రూల్స్ రంజన్ భయపడ్డాడు
X

'ఎస్ఆర్ కళ్యాణమండపం' చిత్రంతో ఉన్నట్లుండి ఫేమ్, క్రేజ్ సంపాదించి.. ఆ తర్వాత సరైన సినిమాలు చేయక వెనుకబడిపోయిన హీరో కిరణ్ అబ్బవరం. తన చివరి చిత్రం 'మీటర్' దారుణమైన ఫలితాన్నందుకుని కిరణ్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. ఈ యువ కథానాయకుడు నటించిన కొత్త సినిమా 'రూల్స్ రంజన్'కు ఒక దశలో మినిమం బజ్ కనిపించలేదు.

కానీ 'సమ్మోహనుడా' పాట.. అందులో హీరోయిన్ నేహా శెట్టి గ్లామర్.. ఫన్నీగా సాగిన ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని కొంత ఆకర్షించాయి. సరైన రిలీజ్ డేట్ కోసం చూస్తున్న టీం 'సలార్' ఖాళీ చేసిన సెప్టెంబరు 28వ తేదీకి తమ చిత్రాన్ని షెడ్యూల్ చేసిన సంగతి తెలిసిందే. 'సలార్' వాయిదా వార్త బయటికి వచ్చిన కొన్ని గంటల్లోనే హడావుడిగా డేట్ ఇచ్చేసింది 'రూల్స్ రంజన్' టీం. కానీ ఆ వీకెండ్‌కు పోటీ బాగా పెరిగిపోవడంతో ఇప్పుడు భయపడి వెనక్కి తగ్గింది.

'స్కంద'; 'చంద్రముఖి-2'; 'పెదకాపు' లాంటి సినిమాల మధ్య 'రూల్స్ రంజన్' పడితే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం కష్టమే. అందుకే సినిమాను వారం వాయిదా వేశారు. అక్టోబరు 6న తమ చిత్రం రిలీజ్ కానున్నట్లు కొత్తగా ప్రకటించారు. ఆ రోజుకు ఆల్రెడీ 'మామా మశ్చీంద్ర', 'మంత్ ఆఫ్ మధు' సినిమాలు షెడ్యూల్ అయినప్పటికీ.. వాటి వల్ల మరీ ప్రమాదం లేదు. కిరణ్‌కు ఈ సినిమా సక్సెస్ కావడం చాలా చాలా అవసరం.

ఇది తేడా కొడితే తన కెరీర్ క్లోజ్ అయిపోయినట్లే.తనతో పాటు దర్శకుడు జ్యోతికృష్ణ సైతం 'రూల్స్ రంజన్'పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం.రత్నం తనయుడైన జ్యోతికృష్ణ గతంలో 'నీ మనసు నాకు తెలుసు'; 'ఆక్సిజన్' లాంటి డిజాస్టర్లు తీశాడు. చాలా గ్యాప్ తీసుకుని అతను డైరెక్ట్ చేసిన ఈ చిత్రం హిట్ కావడం తనకూ చాలా అవసరం. ట్రైలర్‌ను బట్టి చూస్తే 'రూల్స్ రంజన్' మంచి కామెడీ ఎంటర్టైనర్ లాగే కనిపిస్తోంది.