ధిల్లానా అలా ధమ్ ధమ్ చేయోదలా!
లండన్ బ్యూటీ రుక్సార్ థిల్లానా టాలీవుడ్ కి సుపరిచితమే. అమ్మడు `కృష్ణార్జున యుద్దం`తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
By: Tupaki Desk | 11 Dec 2023 9:30 AMలండన్ బ్యూటీ రుక్సార్ థిల్లానా టాలీవుడ్ కి సుపరిచితమే. అమ్మడు `కృష్ణార్జున యుద్దం`తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అటుపై `ఏబీసీడీ`..`అశోక వనంలో అర్జున కళ్యాణం` లాంటి చిత్రాల్లో నటించింది. కానీ ఏవి రుక్సార్ కెరీర్ కి కలిసి రాలేదనే చెప్పాలి. అందం..అభినయం...ప్రతిభ ఉన్నా! రుక్సార్ కెరీర్ ముందడుగు పడటానికి అవేవి ఉపయోగ పడటం లేదు. చేతిలో ఒకటి రెండు అవకాశాలతో గ్యాప్ లేకుండా పనిచేస్తుందనే! ట్యాగ్ తప్ప కెరీర్ ని మాత్రం స్పీడప్ చేయడం లేదు.
పేరు తీసుకు రావడం లేదు. శాండిల్ వుడ్...బాలీవుడ్ లోనూ అదే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో అమ్మడు ఎలా ముందుకు సాగుతుంది? అన్నది చూడాలి. నెట్టింట మాత్రం ఎప్పటి కప్పుడు కొత్త ఫోటోలతో యువత దృష్టిని మాత్రం ఆకర్షిస్తుంది. అందాల విందులో తనదైన మార్క్ తప్పని సరి అంటుంది. గ్లామర్ వరల్డ్ లో ఎంత మంది భామలున్నా! నాదైన ప్రత్యేకతని చాటకపోతే? ఎలా అంటూ ట్రీట్ ఇస్తుంటుంది.
తాజాగా రుక్సార్ మరో కొత్త ఫోటోతో నెటి జనుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలా చిట్టిపొట్టి దుస్తుల్లో గ్లామర్ కా బాప్ అనిపించే లుక్ లో ఆకట్టుకుంటుంది. కురచ దుస్తుల్లో రుక్సార్ అందాల దాడి వావ్ అనిపించకుండా ఉండలేదు. కురచ దుస్తుల్ని కవరప్ చేస్తూ జీన్స్ జాకెట్ ధరించింది. ఇక అమ్మడి టోన్డ్ బాడీని మాత్రం తనదైన శైలిలోనే ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. రుక్సార్ అభిమానులు చూసి ఆస్వాదించకుండా ఉండలేకపోతున్నారు.
మరి ఈ రకమైన ఎలివేషన్లు కొత్త అవకాశాలకు దారులు వేస్తున్నాయా? అంటే అదీ అంత ఈజీ కాదనే చెప్పాలి. ఇన్ స్టా ఎలివేషన్లు కేవలం అక్కడివరకూ పరిమితమవుతున్నాయి. అతికొద్ది మంది మాత్రమే ఇన్ స్టా క్రేజ్ తో అవకాశాలు అందుకోగల్గుతున్నారు. మరి ఆ వరుసలో రుక్సార్ నిలవాలని ఆశిద్దాం.