Begin typing your search above and press return to search.

కన్నడ భామ.. టాలీవుడ్ కి నో..!?

అయితే మరో కన్నడ భామ కూడా ఆ లిస్ట్ లో స్థానం సంపాదించేందుకు రెడీ అవుతుంది.

By:  Tupaki Desk   |   12 April 2024 11:30 PM GMT
కన్నడ భామ.. టాలీవుడ్ కి నో..!?
X

కన్నడ భామలకు టాలీవుడ్ లో మంచి గిరాకీ ఉంటుంది. అక్కడ సో సో ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ కూడా తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటారు. కొందరు కన్నడ సినిమాలు చేస్తూ వాటి డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ పాపులర్ అవుతుంటే మరికొందరు అక్కడ సినిమాలు చేస్తూ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫాం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో కన్నడ భామల శాతమే ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అయితే మరో కన్నడ భామ కూడా ఆ లిస్ట్ లో స్థానం సంపాదించేందుకు రెడీ అవుతుంది.


కన్నడలో సినిమాలు చేస్తూ అక్కడ ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్న రుక్మిణి వసంత్ ఇప్పుడు తెలుగు ఆడియన్స్ కు హా**ట్ ఫేవరెట్ అయ్యింది. అమ్మడు కన్నడలో నటించిన సప్త సాగరాలు దాటి సినిమా తెలుగులో రిలీజ్ చేశారు. ఆ సినిమా చూసిన ఆడియన్స్ అంతా కూడా రుక్మిణితో ప్రేమలో పడిపోయారు. సినిమాలో ప్రియ పాత్రలో రుక్మిణిని చూసిన యువత అంతా కూడా ఆమే తమ ప్రేయసి అని ఊహించుకునేలా మెప్పించింది రుక్మిణి. సప్త సాగరాలు దాటి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న రుక్మిణికి టాలీవుడ్ గ్రాండ్ వెల్కం చెప్పేందుకు రెడీగా ఉంది.

కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే రుక్మిణి మాత్రం ప్రస్తుతం తెలుగు సినిమాలు చేసే ఆలోచనలో లేదన్నట్టు టాక్. తెలుగులో చాలా తక్కువ సినిమాల్లో హీరోయిన్స్ కు ప్రాధాన్యత ఉంటుంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ ను కేవలం పాటల కోసమే తీసుకుంటారు. అలాంటి సినిమాలకు రుక్మిణి దూరంగా ఉంటుంది. తెలుగులో కూడా తను నటించడానికి స్కోప్ ఉన్న సినిమా అయితేనే ఓకే చెప్పాలని చూస్తుంది. అందుకే సప్త సాగరాలు రిలీజ్ టైం లోనే ఒకటి రెండు సినిమా ఆఫర్లు వచ్చినా కాదనేసిందట రుక్మిణి.

సినిమాల సెలక్షన్ విషయంలో రుక్మిణి అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదని ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. కథానాయికకు బలం ఉన్న సినిమాలనే చేయాలని కోరుతుంది. కమర్షియల్ సినిమాలు చేసినా అందులో కూడా హీరోయిన్ పాత్రకు వెయిట్ ఉండాలని భావిస్తుంది. ప్రస్తుతం కోలీవుడ్ లో శివ కార్తికేయన్ తో సినిమా చేస్తున్న రుక్మిణి వసంత్ తెలుగు ఎంట్రీ ఎప్పుడని ఆడియన్స్ ఈగర్ గా ఉన్నారు. మరి అమ్మడు తెలుగులో మొదటి సినిమా ఏది సైన్ చేస్తుందా అన్నది చూడాలి. రవితేజ, విజయ్ దేవరకొండ సినిమాల్లో రుక్మిణి నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఇద్దరిలో రుక్మిణి ఓకే చెప్పే హీరో ఎవరన్నది త్వరలో తెలుస్తుంది.