రుక్మిణి మీద సుక్కు కన్ను..?
ప్రస్తుతం తారక్ తో సినిమా చేస్తున్న రుక్మిణి నెక్స్ట్ సుకుమార్ చరణ్ కాంబో సినిమాలో కూడా నటించే ఛాన్స్ లు ఉన్నట్టు తెలుస్తుంది.
By: Tupaki Desk | 6 July 2025 9:48 AM ISTకన్నడ భామ రుక్మిణి వసంత్ తెలుగులో వరుస క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ లో సూపర్ పాపులారిటీ సంపాధించిన అమ్మడు ప్రస్తుతం ఎన్ టీ ఆర్ ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడమే ఆలస్యం తెలుగులో ఆమెకు ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఒకటి రెండు ఆఫర్స్ ఆమెకు వచ్చాయని తెలుస్తుంది. ఇదిలాఉంటే సుకుమార్ కూడా రుక్మిణి వసంత్ గురించి ఆలోచిస్తున్నాడని టాక్.
పుష్ప 2 తర్వాత సుకుమార్ నెక్స్ట్ సినిమా రాం చరణ్ తో చేస్తాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. చరణ్ పెద్ది తర్వాత చేయబోయే ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే అంచనాలు బాగున్నాయి. సుకుమార్ తో చరణ్ రంగస్థలం సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మళ్లీ ఆ కాంబినేషన్ రిపీట్ అవ్వడం ఫ్యాన్స్ కి మరో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధమని చెప్పొచ్చు.
ఇక ఈ సినిమాలో చరణ్ కి జోడీగా రుక్మిణి వసంత్ ని తీసుకోవాలని సుకుమార్ థింగ్ చేస్తున్నాడట. రుక్మిణి వసంత్ కి తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె నటించిన సప్త సాగరాలు దాటి సినిమా తెలుగు ఆడియన్స్ ని అలరించింది. ఆ సినిమాలో రుక్మిణి ని చూసి మన ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ప్రస్తుతం తారక్ తో సినిమా చేస్తున్న రుక్మిణి నెక్స్ట్ సుకుమార్ చరణ్ కాంబో సినిమాలో కూడా నటించే ఛాన్స్ లు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాజెక్ట్ కన్ ఫర్మ్ అయితే మాత్రం రుక్మిణి నెక్స్ట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటికే ఎన్ టీ ఆర్ తో జత కడుతుంది అనే సరికి ఆమె రేంజ్ పెరిగింది. అంతేకాదు రెమ్యునరేషన్ కూడా బాగా పెంచేసిందని టాక్.
ఇప్పుడు సుక్కు కూడా ఆమెను ఓకే చేస్తే మాత్రం రుక్మిణిని ఆపడం కష్టం. సో కన్నడ భామ రుక్మిణి వసంత్ కూడా తెలుగులో సూపర్ ఫాం లో వచ్చే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. రుక్మిణి వసంత్ కూడా తెలుగు సినిమా ఛాన్స్ లతో పాటు ఇక్కడ ఆడియన్స్ తన మీద చూపిస్తున్న ప్రేమకు సంతోషంగా ఉన్నట్టు తెలుస్తుంది.
