Begin typing your search above and press return to search.

స్టార్ హీరోలతో రుక్మిణి.. కానీ 'మెయిన్ హీరోయిన్' గుర్తింపు ఎక్కడ?

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు.

By:  M Prashanth   |   15 July 2026 6:00 PM IST
స్టార్ హీరోలతో రుక్మిణి.. కానీ మెయిన్ హీరోయిన్ గుర్తింపు ఎక్కడ?
X

కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ ప్రస్తుతం బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒకరు. వరుసగా భారీ పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్సులు దక్కించుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే ఆ జర్నీలో ఒక ఆసక్తికరమైన చర్చ వినిపిస్తోంది. పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ దక్కుతున్నప్పటికీ, ఆ ప్రాజెక్టుల్లో ఆమెను ఫిమేల్ లీడ్ రోల్ లో కాకుండా కీలక పాత్రల్లోనే ఎక్కువగా చూస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నిజానికి రుక్మిణి వసంత్‌ కు యాక్టింగ్ పై ఉన్న ఇంట్రెస్ట్, ఎడ్యుకేషన్ బ్యాక్ గ్రౌండ్ ఆమెను ఇతర హీరోయిన్లలో ప్రత్యేకంగా నిలబెట్టాయి. లండన్‌ లోని ప్రముఖ రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్‌ లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్న ఆమె, 2019లో కన్నడ చిత్రం బీర్బల్ ట్రైలజీ కేసు 1తో సినీ రంగంలో అడుగుపెట్టారు. స్టార్టింగ్ నుంచి యాక్టింగ్ కు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

అయితే ఆమె కెరీర్‌ కు అసలైన జోష్ తీసుకొచ్చింది సప్త సాగరాలు దాటే చిత్రం. ఆ సినిమాలో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. ఆ చిత్ర విజయంతో రుక్మిణి పేరు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారి వినిపించడం ప్రారంభమైంది. నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను కరెక్ట్ గా పోషించగల నటిగా ఆమెకు గుర్తింపు లభించింది. దీని తర్వాత వచ్చిన అవకాశాలు కూడా చిన్నవి కావు.

కాంతార: చాప్టర్ 1 సినిమాలో నటించజడం ఆమె కెరీర్‌ లో మరో మెయిన్ టర్నింగ్. ఆ సినిమా ద్వారా ఆమెకు మరింత ఫేమ్ లభించే అవకాశం వచ్చింది. అదే సమయంలో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరవ్వడం ప్రారంభమైంది. ప్రస్తుతం రుక్మిణి వసంత్ చేతిలో ఉన్న ప్రాజెక్టులను చూస్తే, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యంత క్రేజీ కాంబినేషన్లలో ఆమె ఛాన్స్ సంపాదించుకున్నట్లు క్లియర్ గా తెలుస్తోంది.

యష్ నటిస్తున్న టాక్సిక్, జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందుతున్న డ్రాగన్, రజనీకాంత్ కొత్త చిత్రం ధర్మన్ వంటి భారీ ప్రాజెక్టుల్లో ఆమె నటిస్తున్నారు. ఇవన్నీ పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ హైప్ ఉన్న సినిమాలే. అయితే ఇక్కడే ఒక ప్రశ్న తలెత్తుతోంది. ఆ సినిమాల్లో రుక్మిణి రోల్స్ ఎంత ఎఫెక్టివ్ వి అయినా.. ఆమెను మెయిన్ హీరోయిన్ గా ప్రొజెక్ట్ చేస్తున్నారా అనే చర్చ కొనసాగుతోంది.

ముఖ్యంగా సప్త సాగరాలు దాటి వంటి చిత్రంతో తన యాక్టింగ్ స్టామినా ప్రూవ్ చేసుకున్న తర్వాత, కథ మొత్తం తన పాత్ర చుట్టూ తిరిగే సినిమాలు కూడా ఆమెకు రావాల్సిన అవసరం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు యష్, ఎన్టీఆర్, రజనీకాంత్ వంటి అగ్ర హీరోల చిత్రాల్లో అవకాశాలు దక్కడం చిన్న విషయం కాదు. ఆ ప్రాజెక్టుల విజయాలు ఆమె రేంజ్ ను మరింత పెంచే అవకాశం ఉంది. ఆ తర్వాత రుక్మిణిని మెయిన్ హీరోయిన్ గా నటించే ఛాన్సులు రావచ్చని సినీ ప్రియులు అంచనా వేస్తున్నారు. మరేం జరుగుతుందో వేచి చూడాలి.