Begin typing your search above and press return to search.

రష్మిక ప్లేస్ కి ఎసరు పెట్టేలా అమ్మడి ప్లాన్..?

సప్త సాగరాలు దాటి సినిమా తర్వాత రుక్మిణి వసంత్ సౌత్ ఆడియన్స్ కి హా**ట్ ఫేవరెట్ అయ్యింది. అమ్మడికి వరుసగా ఇతర భాషల నుంచి ఛాన్స్ లు వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   25 Jun 2025 3:00 AM IST
రష్మిక ప్లేస్ కి ఎసరు పెట్టేలా అమ్మడి ప్లాన్..?
X

కన్నడ పరిశ్రమలో ఆరేళ్ల క్రితమే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అందాల భామ రుక్మిణి వసంత్. హిందీలో అప్ స్టార్స్ అనే సినిమాలో ఎన్.జి.ఓ గర్ల్ గా కనిపించిన రుక్మిణి కన్నడలో బర్ బల్ ట్రియాలజీ కేస్ 1 ఫైండింగ్ వజ్రముని సినిమాలో నటించింది. ఆ సినిమాలో రుక్మిణిని చూసి రక్షిత్ శెట్టి సప్త సాగరాలు దాటి సినిమాలో ఛాన్స్ పట్టేసింది. సప్త సాగరాలు దాటి రెండు భాగాల్లో రుక్మిణి వసంత్ యాక్టింగ్ అదరగొట్టేసింది. సినిమాలో ఆమెను చూసిన యూత్ ఆడియన్స్ అంతా ఆమెకు ఫిదా అయ్యారు.

సప్త సాగరాలు దాటి సినిమా తర్వాత రుక్మిణి వసంత్ సౌత్ ఆడియన్స్ కి హా**ట్ ఫేవరెట్ అయ్యింది. అమ్మడికి వరుసగా ఇతర భాషల నుంచి ఛాన్స్ లు వస్తున్నాయి. ఇప్పటికే తమిళ్ లో విజయ్ సేతుపతితో ఏస్ సినిమా చేసిన రుక్మిణి వసంత్ శివ కార్తికేయన్ తో మదరాసి సినిమాలో కూడా అవకాశం అందుకుంది. ఇక తెలుగులో నిఖిల్ తో అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాతో వచ్చినా ఆ సినిమా ఎవరు పట్టించుకోలేదు.

లేటెస్ట్ గా అమ్మడు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో సినిమాలో ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. నీల్ తో సినిమా అది కూడా ఎన్టీఆర్ లాంటి స్టార్ తో ఛాన్స్ అంటే అది మామూలు విషయం కాదు. తప్పకుండా రుక్మిణి సౌత్ సినిమాల్లో తన ఇంపాక్ట్ గట్టిగా చూపించేలా ఉందని అనిపిస్తుంది. తనకు యూత్ ఆడియన్స్ లో ఏర్పడిన క్రేజ్ చూస్తే సరిగ్గా ఒక్క బ్లాక్ బస్టర్ పడితే ఇక అమ్మడిని తీసుకెళ్లి టాప్ ప్లేస్ లో పెట్టేలా ఉన్నారు.

ఆల్రెడీ కన్నడ నుంచి వచ్చి రష్మిక టాలీవుడ్ ని మాత్రమే కాదు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ సెన్సేషన్ గా మారింది. ఇక ఇప్పుడు రష్మిక తర్వాత రుక్మిణి అదే రేంజ్ ఫాం కొనసాగించాలని చూస్తుంది. రష్మిక ప్లేస్ కి ఎసరు పెట్టే ప్లానింగ్ లో భాగంగానే రుక్మిణి స్టార్ ఛాన్స్ లు పట్టేస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా తప్పకుండా రుక్మిణికి ఆ ఛాన్స్ ఉందనే అనిపిస్తుంది. రుక్మిణి వసంత్ చేస్తున్న ఎన్టీఆర్ సినిమా బ్లాక్ బస్టర్ కొడితే మాత్రం అమ్మడికి ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. ఇదే కాదు మరో రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.