Begin typing your search above and press return to search.

అదృష్టానికే అదృష్టవంతురాలు ఈహీరోయిన్!

హీరోయిన్ గా స‌క్సెస్ అవ్వాలంటే అందం..అభిన‌యం ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా క‌లిసి రావాలి.

By:  Tupaki Desk   |   27 May 2025 10:45 AM IST
అదృష్టానికే అదృష్టవంతురాలు  ఈహీరోయిన్!
X

హీరోయిన్ గా స‌క్సెస్ అవ్వాలంటే అందం..అభిన‌యం ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా క‌లిసి రావాలి. అప్పుడే అది సాధ్య‌మ‌వుతంది. అంద‌మైన భామ‌లంతా హీరోయిన్లు కాలేరు. ప్రతిభ ఒక్క‌టే ఉన్నా సాధ్యం కాదు. ఆ రెండింటితో పాటు అదృష్టం కూడా తోడైతేనే సాధ్య‌మ‌వుతుంది. కానీ క‌న్న‌డ బ్యూటీ రుక్మిణీ వసంత్ మాత్రం అదృష్టానికి అదృష్ట‌వంతురాలు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అమ్మ‌డు `స‌ప్త‌సా గ‌రాలు దాటి` అనే క‌న్న‌డ చిత్రంతో తెలుగు నాట ప‌రిచ‌య‌మైన సంగ‌తి తెలిసిందే. తొలి సినిమా తో ఇక్క‌డ మంచి పేరు తీసుకొచ్చింది. అమ్మ‌డికి ఈ సినిమాలో అవ‌కాశం ఎంత ఈజీగా వ‌చ్చిందో తెలిస్తే షాక్ అవుతారు. అవును ఈ విష‌యంలో తానెంతో ల‌క్కీ అని రుక్మిణీ చెప్పుకొచ్చింది. ఆ సినిమా డైరెక్ట‌ర్ ఇచ్చిన ప్ర‌క‌ట‌న పేప‌ర్లో చూసి అత‌డి నెంబ‌ర్ కు ఒక్క మేసేజ్ పెట్టిందిట‌.

అనుమ‌తి ఇస్తే ఆడిష‌న్ లో పాల్గొంటాను అని ఆ మెసేజ్ లో ఉంది. న‌ట‌న‌లో త‌ను అభ‌నువాన్ని అందులో జోడించింది. స‌రే రండి అని రిప్లై ఇచ్చారుట‌. ఆ మేసేజ్ డైరెక్ట‌ర్ చూడ‌క‌పోయి ఉంటే ఆ ఛాన్స్ త‌న‌కు వ‌చ్చేది కాద‌ని...దీన్నే అదృష్టం అంటార‌ని పేర్కొంది. కాబ‌ట్టి ఎంత క‌ష్ట‌ప‌డినా స‌రే ఆవ‌గింజంత అదృష్టం కూడా కలిసొస్తేనే గొప్ప స్థానానికి చేరుకునే అవ‌కాశం ఉంటుంది.

ప్ర‌స్తుతం రుక్మిణీ వ‌సంత్ ఏకంగా పాన్ ఇండియా ఛాన్సులే అందుకుంటుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న `డ్రాగ‌న్` లో న‌టిస్తోంది. క‌న్న‌డ బ్యూటీ కావ‌డంతో ప్ర‌శాంత్ నీల్ మ‌రో ఆలోచ‌న లేకుండా రుక్మిణీని తీసుకున్నాడు. అలాగే ముర‌గ‌దాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `మ‌ద‌రాసి`లోనూ ఈ భామే హీరోయిన్. విజ‌య్ సేతుప‌తికి జోడీగా `ఏస్` అనే చిత్రంలోనూ న‌టిస్తోంది. ఇలా ఇన్ని ఛాన్సులు వ‌చ్చాయంటే కార‌ణం తొలి సినిమాతో తానేంటే ప్రూవ్ చేసుకోవ‌డంతోనే సాధ్య‌మైంది. ఇక్క‌డ ట్యాలెంట్ వ‌ర్కౌట్ అయింది.