Begin typing your search above and press return to search.

లేలేత మెరుపులతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న రుక్మిణీ!

కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది అనేది ఎంత వాస్తవమో.. కొత్త హీరోయిన్లు వచ్చేసరికి పాత వాళ్ళ క్రేజ్ తగ్గుతుందనే కామెంట్లు కూడా అంతే వినిపిస్తూ ఉన్నాయి.

By:  Madhu Reddy   |   25 Feb 2026 4:00 PM IST
లేలేత మెరుపులతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న రుక్మిణీ!
X

కొత్త నీరు వస్తే పాత నీరు పోతుంది అనేది ఎంత వాస్తవమో.. కొత్త హీరోయిన్లు వచ్చేసరికి పాత వాళ్ళ క్రేజ్ తగ్గుతుందనే కామెంట్లు కూడా అంతే వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ కొత్త హీరోయిన్లు కూడా తమ లేలేత మెరుపులతో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలలోకి అడుగుపెట్టి తమ అందంతో ప్రేక్షకులలో ఒక ఉనికిని సంపాదించుకుంటూనే.. ఇంకొక వైపు నటనతో విశ్వరూపం చూపించే ప్రయత్నం చేస్తున్నారు.అటు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ.. ఫాలోవర్స్ ను పెంచుకుంటూ బ్రాండ్ ప్రమోటర్స్ గా కూడా మారుతున్నారు.




ఇదిలా ఉండగా 2024లో నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది రుక్మిణి వసంత్. అంతకుముందు కన్నడలో నటించిన ఈమెకు మంచి గుర్తింపు లభించింది కానీ ఈ తొలి తెలుగు చిత్రంతో పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ఆ తర్వాత ఏ. ఆర్.మురగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా మదరాసి సినిమాతో తమిళ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఎప్పుడైతే రిషబ్ శెట్టి తన కాంతారా చాప్టర్ 2 సినిమాలో అవకాశం కల్పించారో అప్పటినుంచి ఈమె వార్తల్లో నిలుస్తూ వచ్చింది. ఇక సినిమాలో తన అద్భుతమైన నటనతో విశ్వరూపం చూపించింది.




ఈ ఒక్క సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికంటే ముందే ఈమె ఎన్టీఆర్ - ప్రశాంత్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాకి కూడా సైన్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా విక్రమ్ కొడుకు ధృవ్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈమె.. మరొకవైపు నాగచైతన్య కొత్త సినిమాలో కూడా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో హీరో యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమాలో కూడా రుక్మిణి వసంత్ కీలకపాత్ర పోషిస్తుంది . ఇలా భారీ ప్రాజెక్టులలో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన రుక్మిణి మరొకవైపు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే తాజాగా సింపుల్ లుక్ లో లేత అందాలను చూపిస్తూ అభిమానులను మెస్మరైజ్ చేసింది. సింపుల్ అవుట్ఫిట్ తో అందాలు మొత్తాన్ని దాచేస్తూ లేత మోముతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక రుక్మిణి వసంత్ తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా .. అమ్మడి అందానికి అభిమానులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాజాగా రుక్మిణి వసంత్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్నాయి.