Begin typing your search above and press return to search.

గ్లామర్ డోస్ పెంచిన రుక్మిణి వసంత్.. ట్రెండ్ ఫాలో అవుతోందా?

ఈ క్రమంలోనే మరొకసారి ట్రెండ్ ఫాలో అవ్వడానికి సిద్ధమయ్యిందో లేదో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి పూనుకుందో తెలియదు కానీ ప్రముఖ అందాల తార రుక్మిణి వసంత్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

By:  Madhu Reddy   |   20 April 2026 7:16 PM IST
గ్లామర్ డోస్ పెంచిన రుక్మిణి వసంత్.. ట్రెండ్ ఫాలో అవుతోందా?
X

ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్స్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ పై ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ వంటి పేజీలలో అందాలు ఆరబోస్తూ ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా గ్లామర్ వలకబోస్తూ ఫాలోవర్స్ ను పెంచుకోవడమే కాకుండా తమ అందాలతో అభిమానులను కట్టిపడేస్తున్నారు. ఈ క్రమంలోనే మరొకసారి ట్రెండ్ ఫాలో అవ్వడానికి సిద్ధమయ్యిందో లేదో కొత్త ట్రెండ్ సెట్ చేయడానికి పూనుకుందో తెలియదు కానీ ప్రముఖ అందాల తార రుక్మిణి వసంత్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు మాత్రం అభిమానులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.




గ్లామర్ డోస్ పెంచిన రుక్మిణి వసంత్..

ఎప్పటికప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో కనిపిస్తూ ఏమాత్రం గ్లామర్ కు చోటు ఇవ్వకుండా సింపుల్గా, ట్రెడిషనల్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. సడన్గా గ్లామర్ డోస్ పెంచేసి తాజాగా షేర్ చేసిన ఫోటోలు , ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి అభిమానులకు చెమటలు పడుతున్నాయి. తాజాగా గోల్డెన్ కలర్ ఆర్గాంజా శారీ కట్టుకున్న ఈమె వితౌట్ బ్లౌజ్ లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. నాటి తరం గ్రామీణ గెటప్ లో కనిపించి హొయలు పోయింది. ప్రత్యేకించి జుట్టును లీవ్ చేసి చేతులకు పలు రకాల రింగ్స్ ధరించి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది రుక్మిణి వసంత్. చాలా రోజుల తర్వాత ఇలాంటి ఫోటోషూట్ షేర్ చేయడంతో అభిమానులు, నెటిజన్స్ రుక్మిణి వసంత్ లేటెస్ట్ లుక్ పై తెగ కామెంట్లు చేస్తున్నారు. సమ్మర్ వేళ ఇలాంటి హాట్ డోస్ పెంచి మరింత హీటెక్కిస్తోంది అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే.. మరి కొంతమంది నీ అందానికి తట్టుకోలేకపోతున్నాం అంటూ తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.




రుక్మిణి వసంత్ సినిమా ప్రయాణం..

1994 డిసెంబర్ 10న కర్ణాటక బెంగళూరులో కన్నడ మాట్లాడే కుటుంబంలో జన్మించింది రుక్మిణి. ఈమె తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్. భారతదేశ అత్యున్నత శాంతికాల సైనిక అలంకరణ అయిన అశోక చక్ర కర్ణాటక రాష్ట్రం నుండి పొందిన మొదటి వ్యక్తి. లండన్ లోని బ్లూమ్స్ బరిలో రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్ లో నటన శిక్షణ పొందిన ఈమె.. బీర్బల్ ట్రైలాజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని అనే చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. కన్నడలో వచ్చిన ఈ సినిమా ఈమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ తర్వాత సప్త సాగరాలు దాచేయేల్లో , బాణదరియల్లి, భగీర వంటి కన్నడ చిత్రాలు చేసింది రుక్మిణి.




రుక్మిణి తెలుగు సినిమా కెరియర్..

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అనే తెలుగు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ప్రస్తుతం ఎన్టీఆర్ - ప్రశాంత్ నీళ్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాలో నటిస్తోంది. ఇక అలాగే కాంతారా చాప్టర్ 1 సినిమాతో పాన్ ఇండియా స్టేటస్ ని సొంతం చేసుకున్న రుక్మిణి.. ప్రస్తుతం లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వస్తున్న టాక్సిక్ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అలాగే హీరో శింబు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో చేస్తున్న కొత్త సినిమాలో కూడా అవకాశం అందుకుంది. ఈ చిత్రానికి ఏజీఎస్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.