Begin typing your search above and press return to search.

బాబోయ్ రుక్మిణి డిమాండ్ ఈ రేంజ్ లోనా..?

కన్నడ భామ రుక్మిణి వసంత్ వెంట దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కన్నడలో ఆమె నటించిన సప్త సాగరాలు దాటి సినిమా సక్సెస్ అయ్యింది.

By:  Tupaki Desk   |   7 Jun 2025 9:29 AM IST
బాబోయ్ రుక్మిణి డిమాండ్ ఈ రేంజ్ లోనా..?
X

కన్నడ భామ రుక్మిణి వసంత్ వెంట దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. కన్నడలో ఆమె నటించిన సప్త సాగరాలు దాటి సినిమా సక్సెస్ అయ్యింది. ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో కూడా డబ్ అయ్యి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ రుక్మిణి ప్రేమలో పడిపోయారు. మన ఆడియన్స్ రుక్మిణి మీద చూపిస్తున్న అటెన్షన్ చూసి ఇక్కడ సినిమాల్లో ఆమెను తీసుకుంటున్నారు. ఐతే నిఖిల్ తో ఆల్రెడీ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా చేసింది రుక్మిణి. ఆ సినిమా ఎలా వచ్చిందో అలా వెళ్లింది.

ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో ప్రాజెక్ట్ లో రుక్మిణి నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాతో అమ్మడు కచ్చితంగా టాప్ రేంజ్ కి వెళ్లే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. తెలుగు పాన్ ఇండియా సినిమాల్లో నటించే భామలకు ఇతర భాషల్లో కూడా ఒక రేంజ్ డిమాండ్ ఏర్పడుతుంది. ఇదే క్రమంలో రుక్మిణి వసంత్ కి కూడా మంచి డిమాండ్ ఏర్పడిందని అంటున్నారు. తారక్ సినిమాకు ఇలా సెలెక్ట్ అయ్యిందో లేదో అల్లు అర్జున్ సినిమాకు ఆమెను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.

అట్లీ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాలో రుక్మిణి నటిస్తే మాత్రం తప్పకుండా అమ్మడికి మరింత పాపులారిటీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. అందుకే డిమాండ్ ని గుర్తించిన రుక్మిణి సినిమాలకు తను తీసుకునే రెమ్యునరేషన్ ని కూడా పెంచేసిందని తెలుస్తుంది. సినిమాకు మొన్నటిదాకా కోటికి అటు ఇటుగా తీసుకునే రుక్మిణి వసంత్ ఇప్పుడు 3, 4 కోట్లు దాకా అడుగుతుందని తెలుస్తుంది.

రుక్మిణి వసంత్ ఫ్యాన్స్ కి మాత్రం ఆమె చేస్తున్న సినిమాలు చూసి సూపర్ హ్యాపీగా ఉన్నారు. రుక్మిణి నుంచి రాబోతున్న సినిమాలన్నీ కూడా సూపర్ బజ్ తో వస్తున్నాయి. ఈ బజ్ కి తోడు ఒక్క హిట్టు పడితే మాత్రం రుక్మిణిని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. రుక్మిణి వసంత్ కూడా సౌత్ లో తను చేస్తున్న సినిమాలతో టాప్ లీగ్ కి వెళ్లాలని చూస్తుంది. ఐతే అమ్మడు మిగతా సినిమాల్లో బిజీ అవ్వడం వల్ల కన్నడలో వస్తున్న ఆఫర్లను కాదని చెప్పాల్సిన పరిస్థితి వస్తుందట. కన్నడ నుంచి వచ్చిన రష్మిక నేషనల్ క్రష్ కాగా ఆమె తర్వాత రుక్మిణి కూడా నేషనల్ లెవెల్ లో అదరగొట్టేలా ఉందని చెప్పొచ్చు.