థై స్లిట్ గౌనులో నటి X-క్లూజివ్ భంగిమ
మంచు కాంపౌండ్ సినిమా మోసగాడులో నటించింది రూహీ సింగ్. బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ భామ కాంటాక్ట్స్ ని మెయింటెయిన్ చేస్తోంది.
By: Tupaki Desk | 28 April 2025 9:54 AM ISTమంచు కాంపౌండ్ సినిమా మోసగాడులో నటించింది రూహీ సింగ్. బాలీవుడ్ టు టాలీవుడ్ ఈ భామ కాంటాక్ట్స్ ని మెయింటెయిన్ చేస్తోంది. కానీ రూహీ మోడలింగ్ లో రాణించినంతగా సినిమాలతో రాణించలేదన్నది వాస్తవం. కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ గా ఫోటోషూట్లతో పాపులరైన రూహీ, ఆ తర్వాత బాలీవుడ్ లో మాధుర్ భండార్కర్ `క్యాలెండర్ గర్ల్` సినిమాతో అడుగు పెట్టింది. అటుపై వరస చిత్రాల్లో నటించింది. కానీ ఏవీ ఆశించిన సక్సెస్ ని ఇవ్వలేదు.
చాలా కాలం తర్వాత టాలీవుడ్ లో మోసగాడు చిత్రంతో అడుగుపెట్టింది. రూహీ ఇప్పటికీ హిందీ, తెలుగు చిత్రాల్లో నటించాలని కలలు కంటోంది. కానీ ఆశించిన అవకాశాలేవీ వరించలేదు. రూహీ వెబ్ సిరీస్ లు, మ్యూజిక్ ఆల్బమ్స్ లోను నటించింది. కానీ ఇటీవల ఈ అవకాశాలు కూడా లేవు. ప్రస్తుతానికి మోడలింగ్ అసైన్ మెంట్స్ తో కాలం నెట్టుకొస్తున్న ఈ బ్యూటీ ఇన్ స్టా అభిమానులకు నిరంతర ట్రీట్ ని కొనసాగిస్తోంది.
తాజాగా రూహీ రెడ్ హా* లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. థై స్లిట్ ఫ్రాక్ లో రూహీ రకరకాల భంగిమల్లో చెలరేగిపోయింది. తాజా ఫోటోషూట్ లో ఎక్స్ క్లూజివ్ థై స్లిట్ ఎలివేషన్ కి చెందిన ఫోటోగ్రాఫ్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ గా మారింది. అందాల రూహీ ఈ భంగిమలో చాలా హా* గా, స్పెషల్ గా ఉందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. రూహీ 2023లో సోషల్ కరెన్సీ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్ట్ గురించిన ఎలాంటి సమాచారం రాలేదు.
