Begin typing your search above and press return to search.

మిల్కీ అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది

తాజాగా రుహానీ షేర్ చేసిన ఓ సెల్ఫీ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో రుహానీ టూపీస్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది.

By:  Tupaki Desk   |   26 Feb 2024 3:36 PM GMT
మిల్కీ అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది
X

మిల్కీ అందాల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది... త‌మ‌న్నాకు రీప్లేస్‌మెంట్‌లా క‌నిపిస్తోంది! ఇంత‌కీ ఎవ‌రీ భామ అంటే.. ? హిమ‌చల్ బ్యూటీ రుహానీ శ‌ర్మ‌. శీత‌ల ప్ర‌దేశం నుంచి ఉష్ణ మండ‌లం అయిన‌ సౌతిండ‌స్ట్రీలో ఈ భామ అనూహ్య విజ‌యాలు సాధించింది. క‌థానాయిక‌గా కెరీర్ ఆరంభం చిన్న హీరోల స‌ర‌స‌న‌ న‌టించినా కానీ.. న‌టిగా త‌న‌దైన ముద్ర వేయ‌డంతో ఇప్పుడు క్రేజీ ప్రాజెక్టుల్లో అవ‌కాశాలు అందుకుంటోంది.

తాజాగా రుహానీ షేర్ చేసిన ఓ సెల్ఫీ ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. ఇందులో రుహానీ టూపీస్ లో ద‌ర్శ‌న‌మిచ్చింది. టాప్‌లో అంద‌మైన ఫ్లోర‌ల్ డిజైన్.. ఎరుపురంగు ప‌రికిణీలో రుహానీ శృంగ‌ర ర‌స‌ర‌మ్య‌ నాయిక‌ను త‌ల‌పించింది. ఆ చేతికి చుట్టిన కంక‌ణాలు.. మెడ‌లో పొందిగ్గా అమ‌రిన హారం.. ఈ లుక్ గుండెల్ని ట‌చ్ చేస్తోంది.

రుహానీ న‌టించిన త‌దుప‌రి చిత్రం ఆప‌రేష‌న్ వేలెంటైన్. వ‌రుణ్ తేజ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన ఈ చిత్రం త్వ‌ర‌లో విడుద‌ల కానుంది. ఇందులో వైమానిక ద‌ళ అధికారిణిగా రుహానీ క‌నిపించ‌నుంది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ లో అవ‌కాశం ద‌క్కినందుకు రుహానీ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. ఈ పాత్ర కోసం ప‌లువురు యుద్ధ వీరుల‌ను ప‌రిశీలించాన‌ని చెబుతోంది.