Begin typing your search above and press return to search.

చెల్లి స‌ల‌హాల‌తో హీరోయిన్ గా ఆ బ్యూటీ!

'చిల‌సౌ' సినిమాతో తెరంగేట్రం చేసిన సిమ్లా బ్యూటీ రుహాని శ‌ర్మ సుప‌ర‌చితురాలే. తొలి సినిమాతోనే స‌క్సెస్ ఖాతాల వేసుకుంది

By:  Tupaki Desk   |   9 April 2024 1:30 PM GMT
చెల్లి స‌ల‌హాల‌తో హీరోయిన్ గా ఆ బ్యూటీ!
X

'చిల‌సౌ' సినిమాతో తెరంగేట్రం చేసిన సిమ్లా బ్యూటీ రుహాని శ‌ర్మ సుప‌ర‌చితురాలే. తొలి సినిమాతోనే స‌క్సెస్ ఖాతాల వేసుకుంది. త్రివిక్ర‌మ్ లాంటి దిగ్గ‌జ ద‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు రిలీజ్ కి ముందే అందుకుంది. రిలీజ్ త‌ర్వాత అంద‌రి నోట పాజిట‌వ్ వైబ్ తో స‌క్సెస్ గాళ్ల గా నిరూపించుకుంది. అదే ఊపులో 'హిట్'..'డ‌ర్టీ హ‌రి' చిత్రాల్లో బ్యాక్ టూ బ్యాక్ అవ‌కాశాలు అందుకుంది. 'హిట్' మంచి విజ‌యం సాధించింది. కానీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన బోల్డ్ అటెంప్ట్ 'డ‌ర్టీ హ‌రి' మాత్రం వాటిని అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది.

ఈ సినిమాతో రుహాని త‌న‌లో సెకెండ్ యాంగిల్ ని ప‌రిచయం చేసింది. బోల్డ్ పెర్పార్మెన్స్ తో విమ‌ర్శ‌ల‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. కానీ సినిమా వైఫ‌ల్యం తో ఆ శ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. అటుపై 'నూటొక్క జిల్లాల అంద‌గాడు' లో ఛాన్స్ వ‌చ్చింది. కానీ ఆ సినిమా ఫ‌లితం అమ్మడిని వెన‌క్కి లాగిపెట్టింది. ఇటీవ‌లే 'సైంధ‌వ్' ..'ఆప‌రేష‌న్ వాలంటైన్' సినిమాలతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇద్ద‌రు స్టార్ హీరోలు..భారీ బ‌డ్జెట్ సినిమాల‌న్ని చాలా ఆశ‌లే పెట్టుకుంది.

కానీ అవి నెర‌వేర‌లేదు. పాన్ ఇండియాలో రిలీజ్ అయిన ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాలు సాధించాయో తెలిసిందే. అయినా అమ్మ‌డికి అవ‌కాశాల‌కు కొద‌వ‌లేదు. కొన్ని కొత్త సినిమ‌ల‌కు సైన్ చేసింది. అందులో ఒక‌టి 'శ్రీరంగ నీతులు' ఆన్ సెట్స్ లో ఉంది. ఈనేప‌థ్యంలో ఓ ఇంట‌ర్వ్యూలో రుహానీ స‌క్సెస్ సీక్రెట్ ని రివీల్ చేసింది. త‌న విజ‌యం వెనుక త‌న చెల్లెలు కీల‌క పాత్ర ధారి అని తెలిపింది.

రుహానీ చెల్లెలకి సినిమాల‌పై త‌న‌కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందిట‌. ఎలాంటి పాత్రలు చేయాలో ఆమె సలహాలు ఇస్తుంటుందిట‌. నిజ జీవితంలో హాస్యం అంటే ఇష్టం కదా.. అలాంటి పాత్రలే చెయ్యి అని చెబుతుంటుంది. అలాంటి పాత్ర‌ల కోసం ఎదురు చూస్తున్న‌ట్లు తెలిపింది. స‌క్సెస్ లో సగం క్రెడిట్ త‌న చెల్లికే ద‌క్కుతుందంది. మొత్తానికి రుహానీ చెల్లెలు అంటే అంతే ఇష్ట‌మ‌ని తెలుస్తోంది.