Begin typing your search above and press return to search.

గెస్ చేయండి అంటూ ఆట ప‌ట్టించిన బ్యూటీ

ఇదిగో ఇప్పుడు నేను ఎక్క‌డ ఉన్నాను? లొకేష‌న్ గెస్ చేయండి! అంటూ టీజ్ చేస్తోంది సిమ్లా యాపిల్ రుహానీ శ‌ర్మ‌.

By:  Tupaki Desk   |   25 Feb 2024 2:12 PM GMT
గెస్ చేయండి అంటూ ఆట ప‌ట్టించిన బ్యూటీ
X

ఇదిగో ఇప్పుడు నేను ఎక్క‌డ ఉన్నాను? లొకేష‌న్ గెస్ చేయండి! అంటూ టీజ్ చేస్తోంది సిమ్లా యాపిల్ రుహానీ శ‌ర్మ‌. ఈ ఉత్త‌రాది బ్యూటీ చేసింది కొన్ని సినిమాలే అయినా న‌టిగా గొప్ప పేరు తెచ్చుకుంది. ట్రెడిష‌న‌ల్ గా క‌నిపిస్తూనే గ్లామ‌ర‌స్ పాత్ర‌ల‌తో మెప్పించ‌డం ఎలానో రుహానీ చేసి చూపించింది. ఇప్పుడు విడుద‌ల‌కు వ‌స్తున్న `ఆప‌రేష‌న్ వాలెంటైన్` లో రుహానీ పాత్ర ఆస‌క్తిని క‌లిగిస్తోంది. వ‌రుణ్ తేజ్ ఈ చిత్రంలో క‌థానాయ‌కుడిగా న‌టించిన సంగ‌తి తెలిసిందే.


ఇంత‌లోనే రుహానీ సోష‌ల్ మీడియాల్లో ఫోటోషూట్ల‌తో విరుచుకుపడుతోంది. ఆప‌రేష‌న్ వాలెంటైన్ ప్ర‌మోష‌న్స్ కి ముందు ఒక చిన్న విరామాన్ని స‌ద్వినియోగం చేసుకుంటూ విహార యాత్ర‌కు వెళ్లిన ఫోటోల‌ను రుహానీ సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. రుహానీ చాలా సింపుల్ గా గ్రీన్ ఫ్రాక్ ధ‌రించి అన్ నోన్ లొకేష‌న్ లో క‌నిపిస్తోంది. ఇది బీచ్ వెకేష‌న్ అని అర్థ‌మ‌వుతోంది. అయితే ఇది ఏ లొకేష‌న్ గెస్ చేయండి! అంటూ ఆట ప‌ట్టించింది. గోవా, ల‌క్ష్య‌ద్వీప్, మాల్దీవులు, ఫిజీ లేదా ఇంకేదైనా అంద‌మైన బీచ్ లొకేష‌న్ అని భావించాలా? ఆ లొకేష‌న్ ఏదో చెబితే బావుంటుంది కదా! అంటూ నెటిజ‌నులు రుహానీని రెక్వ‌స్ట్ చేస్తున్నారు.


ఇటీవ‌ల పరేషన్ వాలెంటైన్‌లో రుహానీ శర్మ పైలట్ లుక్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇటీవ‌ల విడుద‌ల కాగా.. అవి అందరినీ ఆశ్చర్యప‌రిచాయి. ఈ రేంజు ఇంటెన్స్‌ పాత్రలో కనిపించడం రుహానీకి ఇదే తొలిసారి. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో ఫైటర్ పైలట్‌గా నటించడం అదే సమయంలో స‌వాల్ గా ఉందని రుహానీ చెప్పింది.


``నేను కథనం వింటున్నప్పుడు `వావ్` అనుకున్నాను... ఈ పాత్రను చేస్తాను!!`` అని న‌మ్మ‌కంగా అనుకున్నాను... అని తెలిపింది. టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ (1986) చిత్రంలో మావెరిక్‌గా నటించిన కెల్లీ మెక్‌గిల్లిస్‌కి రుహానీ వీరాభిమాని. ఈ సినిమా చూసినప్పటి నుంచి కూడా అలాంటి పాత్ర చేయాలని అనుకుంటున్నానని చెప్పింది. ఇంత‌లోనే ఫైటర్ పైలట్ అయిన తాన్యా శర్మ పాత్రలో న‌టించే అవ‌కాశం ల‌భించింది. నా అదృష్టాన్ని నేను నమ్మలేకపోయాను`` అని తెలిపింది.

పైలెట్ల‌ జీవితాలపై విస్తృతంగా పరిశోధించి న‌టించాన‌ని కూడా రుహానీ తెలిపింది. తాను నిజ జీవితంలోని ఫైటర్ పైలట్‌లతో మాట్లాడానని, ఈ పాత్రలోకి ప్ర‌వేశించ‌డానికి వారిని గమనించానని రుహానీ చెప్పింది. వారితో కలిసి కొన్ని రోజుల శిక్షణ కూడా తీసుకుందిట‌. వారి దినచర్య ఉద్యోగ అవసరాలు దేశం కోసం వారు చేసే అద్భుతమైన త్యాగాల గురించి అవగాహన పెంచుకుంది. పైలెట్లు నడిచే విధానం..మాట్లాడే తీరును అనుకరించటానికి ప్రయత్నించాను. వారిలా ప్రవర్తించడం సవాలుతో కూడుకున్నది అని చెప్పింది.

గ్వాలియర్‌లో నిజమైన ఫైటర్ ప్లేన్‌లో ఈ చిత్రం కోసం షూట్ చేయడంతో ఆనందం గరిష్ట స్థాయికి చేరుకుంది. పైలట్ యూనిఫాం ధరించడం నాకు ఉన్నత స్థాయిని ఇచ్చింది. నేను అంకితమైన స్క్వాడ్రన్ లీడర్ క్రింద శిక్షణ పొందాను. దేశాన్ని రక్షించడానికి వారు ఎంత కష్టపడుతున్నారో గ్రహించాను అని తెలిపింది. యాక్ష‌న్ సీన్స్ లో క‌నిపిస్తాన‌ని కూడా వెల్ల‌డించింది.