పిక్‌టాక్ : చీరకట్టులో అందాల చి.ల.సౌ
సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన 'చి.ల.సౌ' సినిమాతో రుహాని శర్మ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది.
By: Tupaki Desk | 29 Jun 2025 12:01 PM ISTసుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన 'చి.ల.సౌ' సినిమాతో రుహాని శర్మ హీరోయిన్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ సినిమాలో నటిగా తన ప్రతిభను కనబర్చింది. సాధారణంగా హీరోయిన్స్ స్కిన్ షో చేస్తేనే గుర్తింపు లభిస్తుంది. కానీ ఈ సినిమాలో ఆమె పూర్తిగా పద్దతైన పక్కింటి అమ్మాయిగా కనిపించినా కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అంతే కాకుండా ఇండస్ట్రీలోనూ మంచి గుర్తింపు సొంతం చేసుకుని వరుస సినిమా ఆఫర్లు దక్కించుకుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. హీరోయిన్‌గా ఒక మోస్తరు సినిమాల్లో నటించినప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 15 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉంది.
రుహాని శర్మ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా అందమైన ఫోటో షూట్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. సాధారణంగా హీరోయిన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్కిన్ షో ఫోటో షూట్స్, బోల్డ్ లుక్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. కానీ రుహానీ శర్మ మాత్రం చాలా అరుదుగా మాత్రమే స్కిన్ షో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా చీర కట్టు ఫోటోలు, నిండైన డ్రెస్‌లతో, ట్రెడీషనల్ లుక్‌లో కనిపిస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి చీర కట్టు ఫోటోలతో కన్నుల విందు చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు, మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అంటూ ఉంటారు. తాజా చీర కట్టు ఫోటోలతో చూపు తిప్పనివ్వడం లేదు. రుహాని శర్మ మరోసారి తన అందమైన చీర కట్టు ఫోటోలతో కవ్విస్తోంది.
క్యాప్షన్ దొరకడం లేదు.. ఉత్తమమైనది ఆ స్థానాన్ని గెలుచుకుంటుంది… నేను వేచి చూస్తున్నాను అంటూ తన చీర కట్టు ఫోటోలను షేర్ చేసింది. చీర కట్టు ఫోటోలతో ఎప్పటికప్పుడు రుహాని శర్మ ఆకట్టుకుంటూనే ఉంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు చీర కట్టు ఫోటోల కారణంగా మరింతగా కవ్విస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న రుహానికి దక్కాల్సిన స్థాయిలో ఆఫర్లు దక్కడం లేదు అంటూ అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్య కాలంలో తెలుగులో ఈమె లవ్ మీ సినిమాలో నటించింది. ఆ తర్వాత పెద్దగా ఈమె సినిమాలు చేయలేదు. ప్రస్తుతం హిందీ, తమిళ సినిమాల్లో నటిస్తోంది.
రుహాని శర్మ మోడల్‌గా సుదీర్ఘ కాలం పాటు చేసింది. పలు కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందే మంచి గుర్తింపు దక్కించుకుంది. 2017లో తమిళ చిత్ర కడైసి బెంచ్ కార్తీ లో నటించింది. ఆ సినిమా నిరాశ పరచడం తో తమిళ సినిమా ఇండస్ట్రీలో వెంటనే ఆఫర్లు రాలేదు. తెలుగులో హిట్ 1, నూటొక్క జిల్లాల అందగాడు సినిమాల్లోనూ నటించింది. సైంధవ్, ఆపరేషన్ వాలెంటైన్, శ్రీరంగ నీతులు, డర్టీ హరి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడం ద్వారా టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది. తక్కువ సమయంలోనే ఈ అమ్మడు ఆకట్టుకుంది. కానీ ఈమె చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకోలేక పోవడంతో పెద్ద హీరోల సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకోవడంలో విఫలం అవుతుంది.
