ఎవరు ఈ నటి? కేన్స్ 2025లో మోదీ నెక్లెస్‌తో షాకిచ్చింది!
ఇదిలా ఉంటే, రాజస్తాన్ కి చెందిన రుచి గుజ్జర్ వేషధారణ కేన్స్ లో హాట్ టాపిగ్గా మారింది. ఈ భామ భారీతనం నిండిన రాజస్థానీ డిజైనర్ లెహంగాను ధరించి కనిపించింది.
By: Tupaki Desk | 21 May 2025 2:23 PM ISTకేన్స్ (ఫ్రాన్స్) సినిమా ఉత్సవాల్లో ఈసారి భారతదేశం నుంచి పలువురు కథానాయికలు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఐశ్వర్యారాయ్, నందితా దాస్, జాన్వీ కపూర్, అదితీరావ్ హైదరీ సహా పలువురు కేన్స్ లో సందడి చేసారు. ఇషాన్ ఖత్తర్, ఒర్రీ, ఊర్వశిరౌతేలా కూడా సందడి చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే, రాజస్తాన్ కి చెందిన రుచి గుజ్జర్ వేషధారణ కేన్స్ లో హాట్ టాపిగ్గా మారింది. ఈ భామ భారీతనం నిండిన రాజస్థానీ డిజైనర్ లెహంగాను ధరించి కనిపించింది. అయితే తన మెడలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీనికి కారణం ఆ నెక్లెస్‌లో భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోని ఉంచి డిజైన్ చేయడమే. ఒక దేశ ప్రధానిని ఇలాంటి వేదికకు తీసుకురావడానికి కారణం ఉందని రుచి గజ్జర్ వెల్లడించింది.
ప్రపంచ పటంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చి ఉన్నత శిఖరాలకు చేర్చిన దేశ ప్రధాని నరేంద్ర మోదీని గౌరవించాలనుకున్నాను! అని గుజ్జర్ వ్యాఖ్యానించింది. రూప శర్మ రూపొందించిన విలాసవంతమైన భారీ డిజైనర్ లెహంగా ఈ వేదికకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జరిబారికి చెందిన రామ్ తన దుపట్టాను రూపొందించాడు. జర్దోజీ దుపట్టా రాజస్తానీ సాంస్కృతిక వారసత్వానికి సింబాలిక్ అని తెలిపింది రుచీ.
సైనిక కుటుంబం నుంచి వచ్చిన రుచి గుజ్జర్ దేశభక్తి పరురాలు. రాజస్తాన్ నుంచి ముంబైకి నటి కావాలని వచ్చింది. నిజానికి గుజ్జర్ లు మహిళలు నటనలోకి వెళ్లడానికి వ్యతిరేకం. కానీ దానిని నిరసిస్తూ తాను నటనలోకి ప్రవేశించాలనుకున్నానని కూడా రుచి గుజ్జర్ వ్యాఖ్యానించింది. బాలీవుడ్ పరిశ్రమలో ఇంత దూరం వచ్చిన ఏకైక వ్యక్తిని. నా తండ్రి చాలా మద్దతుగా నిలిచారని తెలిపింది. ముంబైకి వెళుతున్నానంటే తన తల్లి మొదట్లో భయపడిందని, కానీ ఇప్పుడు తాను ఎంత దూరం వచ్చానో చూసి గర్వంగా ఉందని వెల్లడించింది. రుచి అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లో 798కే ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాల ద్వారా ఈ భామ ఆర్జిస్తోంది.
