నిర్మాతను పబ్లిక్ గా చెప్పుతో కొట్టిన హీరోయిన్.. కారణమిదే..
సీరియన్ నటి రుచి గజ్జర్, సో లాంగ్ వ్యాలీ సినిమా నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్ పై చెప్పుతో దాడికి దిగింది.
By: Tupaki Desk | 26 July 2025 3:12 PM ISTబాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీలు కాస్త ఎక్కువే. మిగతా ఇండస్ట్రీలతో పోలీస్తే బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కాస్త భిన్నంగా ఉంటుంది. గాసిప్స్, రూమర్స్ లాంటివి అక్కడ కామనే. కానీ, తాజాగా వివాదం స్థాయి కాస్త పెరిగింది. ఓ సీరియల్ నటి ఏకంగా ఓ నిర్మాతను చెప్పుతో కొట్టింది. అదీనూ పబ్లిక్ ప్లేస్ లో కావడం గమనార్హం. ఇంతకీ అక్కడ ఏం జరిగింది. ఆమె ఎందుకు అలా కొట్టిందంటే..
సీరియన్ నటి రుచి గజ్జర్, సో లాంగ్ వ్యాలీ సినిమా నిర్మాత కరణ్ సింగ్ చౌహాన్ పై చెప్పుతో దాడికి దిగింది. తాజాగా ముంబైలోని ఓ థియేటర్ లో సో లాంగ్ వ్యాలీ సినిమా స్క్రీనింగ్ సందర్భంగా ఆమె నిర్మాతను చెప్పుతో కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆమె ఎందుకు అలా ప్రవర్తించిందో నని అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు.
అయితే నిర్మాత కరణ్ సింగ్ ఓ సీరియర్ నిర్మించే విషయంలో తనను కో ప్రొడ్యూసర్ గా చేరమని చెప్పి ఆమె దగ్గర 24 లక్షల రూపాయలు తీసుకున్నాడని నటి తెలిపింది. ఈ మొత్తాన్ని ఆమె 2023 నుండి 2024 మధ్య ఏడాది లో పలు బ్యాంక్ అకౌంట్లలోకి జమ చేసినట్లు చెప్పింది. ఆ తర్వాత సీనియల్ ప్రారంభం కాకపోవడంతో తాను చెల్లించిన డబ్లులు రిటర్న్ ఇవ్వాలని రుచి కోరిందట.
తన డబ్బు వావసు ఇవ్వకపోగా, తిరిగి కరణ్ ఆమెను బెదిరించాడని నటి ఆరోపణలు చేసింది. ఆ డబ్బు అడిగినప్పుడల్లా కరణ్ దాటవేస్తున్నాడని చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వివాదం ముదిరింది. ఈ క్రమంలోనే నిర్మాతను రుచి.. సో లాంగ్ వ్యాలీ సినిమా ప్రదర్శన సందర్భంగా థియేటర్ వద్ద చెప్పుతో కొట్టినట్లు తెలుస్తోంది.
ఇక ఈ వివాదంపై స్పందించిన ముంబై పోలీసులు నిర్మాతపై భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద చీటింగ్ కేసు నమోదు చేశారు. అలాగే దర్యాప్తు కూడా ప్రారంభించినట్లు సమాచారం.
