Begin typing your search above and press return to search.

RRR హిందీ లో ఎంత తోపు అంటే ...మ‌రో అరుదైన ఫీట్

పాపుల‌ర్ అంత‌ర్జాతీయ‌ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ సమగ్ర వీక్షకుల డేటాలో ఆర్.ఆర్.ఆర్ అగ్ర‌తాంబూలం అందుకుంది

By:  Tupaki Desk   |   13 Dec 2023 9:30 AM GMT
RRR హిందీ లో ఎంత తోపు అంటే ...మ‌రో అరుదైన ఫీట్
X

రాజ‌మౌళి RRR ఇప్ప‌టికే ఎంతో సాధించింది. ఆస్కార్- గోల్డెన్ గ్లోబ్-హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాల‌ను న‌ట్టింటికి తెచ్చిన ఘ‌న‌త ఈ సినిమాకి ద‌క్కింది. భార‌త‌దేశానికి ఇలాంటి ఘ‌న‌త ద‌క్క‌డం కూడా ఇదే తొలిసారి. అది కూడా ఒక తెలుగు సినిమాతో ఇది సాధ్య‌మైంది. ఇప్పుడు ఇదే చిత్రం మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకుంది.

పాపుల‌ర్ అంత‌ర్జాతీయ‌ ఓటీటీ దిగ్గ‌జం నెట్‌ఫ్లిక్స్ సమగ్ర వీక్షకుల డేటాలో ఆర్.ఆర్.ఆర్ అగ్ర‌తాంబూలం అందుకుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ప్రజలు ఎలాంటి సినిమాలు ఎలాంటి కంటెంట్ చూస్తున్నారో విశ్లేషించగా ఆర్.ఆర్.ఆర్ హిందీ వెర్ష‌న్ కి ఉన్న ఫాలోయింగ్ బ‌య‌ట‌ప‌డింది. సంవత్సరానికి రెండుసార్లు విడుదలయ్యే `వాట్ వి వాచ్డ్: ఎ నెట్‌ఫ్లిక్స్ ఎంగేజ్‌మెంట్ రిపోర్ట్`లో ఆరు నెలల్లో వీక్షకులు వీక్షించిన సినిమాల‌కు సంబంధించిన‌ వివరణాత్మక నివేదికను నెట్ ఫ్లిక్స్ వెలువ‌రించ‌గా, భారతీయ సినిమాల్లో RRR (హిందీ),మిషన్ మజ్ను, తూ ఝూతి మెయిన్ మక్కార్, షెహజాదా, క్లాస్ సీజన్ 1 టాప్ 1000 జాబితాలో నిలిచాయి.

ఈ ఏడాది జనవరిలో విడుదలైన సిద్ధార్థ్ మల్హోత్రా - రష్మిక మందన్న ల `మిషన్ మజ్ను` నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లై 31.2 మిలియన్ల వీక్షణ‌ల‌ను సంపాదించింది. దీని తర్వాత రామ్ చరణ్- జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన‌ RRR (హిందీ) 29.4 మిలియన్ల వీక్షణలను సాధించింది. మిష‌న్ మ‌జ్ను నేరుగా ఓటీటీలో విడుద‌ల కాగా, ఆర్.ఆర్.ఆర్ థియేట్రిక‌ల్ వీక్ష‌ణ త‌ర్వాత ఓటీటీలో ఇంత గొప్ప ఆద‌ర‌ణ ద‌క్కించుకోవ‌డం ప‌రిశీలించ‌ద‌గిన‌ది. విదేశీ సిరీస్ కి అనుస‌ర‌ణ అయిన‌ క్లాస్ సీజన్ 1 కూడా జాబితాలో చేరింది. స్పానిష్ డ్రామా ఎలైట్ కి భారతీయ అనుసరణ అయిన క్లాస్ సీజ‌న్ 1 పరిశ్రమకు కొత్త ముఖాలను పరిచయం చేయడమే కాకుండా 27.7 మిలియన్ల వీక్షణ గంటలను సంపాదించింది. దీని తర్వాత రణబీర్ కపూర్ - శ్రద్ధా కపూర్ నటించిన తూ ఝూతి మైన్ మక్కార్ 27.1 మిలియన్ వీక్షణ గంటలతో జాబితాలో నిలివ‌గా, కార్తీక్ ఆర్యన్ -కృతి సనన్‌ల షెహజాదా 24. 8 మిలియన్ల వీక్షకులను సంపాదించింది. 15.6 మిలియన్ల వీక్షకులతో ఆయుష్మాన్ ఖురానా `యాక్షన్ హీరో` జాబితాలో ఉంది.

నెట్ ఫ్లిక్స్ విశ్లేష‌ణ ప్ర‌కారం.. ప్రపంచవ్యాప్తంగా 18,000 కంటే ఎక్కువ శీర్షికల(సినిమాలు, సిరీస్ ల టైటిళ్ల‌)ను కవర్ చేయ‌గా జాబితాలో పైన పేర్కొన్న‌ సినిమాలు టాప్ లో నిలిచాయి. దాదాపు 100 బిలియన్ గంటల వీక్ష‌ణ‌ల‌తో నెట్ ఫ్లిక్స్ సంచ‌ల‌నం సృష్టించింది. ఈ లెక్క‌ ప్రతి టైటిల్ (సినిమా లేదా సిరీస్) కోసం వీక్షించిన గంటలను బ‌ట్టి నిర్ణ‌యించారు.