Begin typing your search above and press return to search.

RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య మృతి

మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

By:  Tupaki Desk   |   15 Feb 2024 3:04 PM GMT
RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ భార్య మృతి
X

RRR సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య రూహి సికింద్రాబాద్‌లో బహుళ అవయవ వైఫల్యం (మ‌ల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్) కారణంగా మరణించారు. పలు మీడియా నివేదికల ప్రకారం, రూహి గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు.

సెంథిల్ కుమార్ తన భార్యను ద‌గ్గ‌రుండి చూసుకోవడానికి పని నుండి విరామం తీసుకున్నాడు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు రూహి అంత్యక్రియలు జరుగుతాయని తెలుస్తోంది.

రూహి యోగా శిక్షకురాలు.. నటి అనుష్క శెట్టితో కలిసి పనిచేసార‌ని స‌మాచారం. భరత్ ఠాకూర్ యోగా క్లాసుల హైదరాబాద్ విభాగానికి కూడా ఆమె సారథ్యం వహించారు. సెంథిక్ కుమార్ - రూహి .. జూన్ 2009లో వివాహం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో రూహికి 4,000 మందికి పైగా అనుచరులు ఉన్నారు. ఇన్ స్టాలో ఆమె బయో లో ఇలా ఉంది. ``2003 నుండి యోగా ఎక్స్‌పోనెంట్.. 20 సంవత్సరాల పాటు టీచర్. యోగా పండిట్ 200RYT. యోగా ఆచార్య 500RYT. సెలబ్రిటీ కోచ్. కార్పొరేట్ ట్రైనర్. వెల్నెస్ ఎక్స్‌పర్ట్`` అని రాసి ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రూహీ తరచూ తన ఫ్యామిలీతో ఫోటోలు షేర్ చేసుకునేవారు.

సెంథిల్ కుమార్ సౌతిండియాలోనే టాప్ సినిమాటోగ్రాఫ‌ర్. ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో ఇంచుమించు అన్ని సినిమాల‌కు క‌లిసి ప‌ని చేసారు. సై, చత్రపతి, యమదొంగ, అరుంధతి, మగధీర, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి 2: ది కన్‌క్లూజన్, RRR వంటి సంచ‌ల‌న చిత్రాల‌కు అత‌డు సినిమాటోగ్రాప‌ర్. త‌దుప‌రి మ‌హేష్ - రాజ‌మౌళి సినిమాకి ప‌ని చేస్తున్నారా లేదా? అన్న‌దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.