Begin typing your search above and press return to search.

RRR సీక్వెల్ స‌స్పెన్స్ వీడిందిలా!

గ‌తంలో చికాగోలో జ‌రిగిన ఓ కార్యక్ర‌మంలో రాజ‌మౌళి మాట్లాడుతూ.. నా తండ్రి గారితో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి కొంత చ‌ర్చ జ‌రిగింది.

By:  Tupaki Desk   |   14 May 2025 5:45 PM
RRR సీక్వెల్ స‌స్పెన్స్ వీడిందిలా!
X

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి తెర‌కెక్కించిన RRR ప్ర‌పంచ‌వ్యాప్తంగా గొప్ప ప్ర‌శంస‌లు అందుకోవ‌డ‌మే గాక, బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ విజయం అందుకుంది. ఈ సినిమా దాదాపు 1200కోట్లు వ‌సూలు చేసింది. అలాంటి గొప్ప విజ‌యం త‌ర్వాత స‌హ‌జంగానే ఈ క్రేజ్ ను ఎన్ క్యాష్ చేసుకోవ‌డానికి సీక్వెల్ తీయ‌డం తెలివైన ఆలోచ‌న‌. కానీ జ‌క్క‌న్న ఇత‌ర క‌మిట్ మెంట్స్ కార‌ణంగా, అప్ప‌టికి సీక్వెల్ ఆలోచ‌న‌కు కామా పెట్టారు. కానీ ఆయన మైండ్ లో ఆర్.ఆర్.ఆర్ 2 బెల్స్ మోగుతూనే ఉన్నాయి. ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ తెర‌కెక్కించేందుకు ఆస్కారం ఉంద‌ని అత‌డు అన్నాడు. క‌థ‌పై ప‌ని జ‌రుగుతోంద‌ని కూడా హింట్ ఇచ్చారు. ఓ సంద‌ర్భంలో ర‌చ‌యిత‌ విజ‌యేంద్ర ప్ర‌సాద్ సైతం సీక్వెల్ ఉంటుంద‌ని హింట్ ఇచ్చారు.

అందుకే ఇప్పుడు లండ‌న్ రాయ‌ల్ ఆల్బ‌ర్ట్స్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రీమియ‌ర్ సంద‌ర్భంగా రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌పై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. చిత్ర‌బృందం లో కీల‌క స‌భ్యులు లండన్‌లో జరిగిన ప్రత్యేక ప్రదర్శనకు హాజరు కాగా, అభిమానుల సంద‌డి న‌డుమ షో కొన‌సాగింది. అక్కడ లైవ్ ఆర్కెస్ట్రాతో సినిమాను ప్రదర్శించారు. థియేటర్ అభిమానులతో నిండిపోయింది. ప్రివ్యూ తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళితో క‌లిసి ప‌రాచికాలాడిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. ఆ ముగ్గురూ క‌లిసి కెమెరాల‌కు సరదాగా పోజులిచ్చారు.

కానీ ఆ క్షణంలో రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల ఒక వీడియో రికార్డ్ చేసి అందరి మనస్సులోని ప్రశ్నను రాజమౌళిని అడిగారు. ``రాజమౌళి.. మీరు ఇప్పుడు RRR 2 చేస్తున్నారా?`` అని ప్ర‌శ్నించారు. ఈ స‌రదా ప్ర‌శ్న అందరినీ నవ్వించింది. రాజమౌళి ఫన్నీగా స్పందించాడు కానీ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ప్ర‌స్తుతానికి ఆర్.ఆర్.ఆర్ సీక్వెల్ ఉంద‌నే అభిమానులు భావిస్తున్నారు. చరణ్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి RRR ఫ‌రెవ‌ర్ అనే క్యాప్షన్ ఇచ్చారు.

గ‌తంలో చికాగోలో జ‌రిగిన ఓ కార్యక్ర‌మంలో రాజ‌మౌళి మాట్లాడుతూ.. నా తండ్రి గారితో ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి కొంత చ‌ర్చ జ‌రిగింది. ఆయ‌న క‌థ‌పై ప‌ని చేస్తున్నారు`` అని అన్నారు. మార్చి 2022లో విడుదలైన RRR సినిమా భారీ విజయాన్ని సాధించింది. సీక్వెల్ గురించి ఇంకా స్ప‌ష్ఠ‌మైన ప్ర‌క‌ట‌న లేదు. అయినా దానికోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు.