Begin typing your search above and press return to search.

ఇంత‌కీ RRR సీక్వెల్ ఉన్న‌ట్టా లేన‌ట్టా?

తాజాగా RRR సీక్వెల్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   10 May 2025 11:30 AM
RRR Sequel Updates
X

టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన యాక్ష‌న్ డ్రామా RRR. జ‌క్క‌న్న తెర‌కెక్కించిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించింది. హాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కులు జేమ్స్ కెమెరాన్‌, స్టీవెన్ స్పీల్ బ‌ర్గ్‌, స్టార్ వార్స్ డైరెక్ట‌ర్ జె.జె.అబ్ర‌హం ఈ మూవీతో పాటు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి, హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌రీ ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ఇంట్రోతో పాటు ఎన్టీఆర్ ఎనిమ‌ల్ ఎంట్రీపై ప్రశంస‌లు కురిపించారు. స్టార్ వార్స్ డైరెక్ట‌ర్ జె.జె. అబ్ర‌హం అయితే మ‌రో అడుగు ముందుకేసి ఎన్టీఆర్‌తో సినిమాకు తాను రెడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు.

హాలీవుడ్ ప్ర‌ముఖుల‌ని మెప్పించి వారి ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకున్న RRR వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.1300 కోట్ల‌కు పైనే రాబ‌ట్టి రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల కెరీర్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన పాన్ ఇండియా మూవీగా నిలిచి సంచ‌ల‌నం సృష్టించింది. రామ్ చ‌ర‌ణ్ ఈ మూవీతో గ్లోబ‌ల్ స్టార్‌గా మారిపోయారు. హాలీవుడ్ డైరెక్ట‌ర్ల దృష్టిని ఆక‌ర్షించారు. ఎన్టీఆర్ కూడా ఈ సినిమాతో త‌న మార్కెట్‌ని పెంచుకుని దిగ్గ‌జ హాలీవుడ్ డైరెక్ట‌ర్లు ఆఫ‌ర్లు ఇచ్చే స్థాయికి చేరిపోయారు. ఇదిలా ఉంటే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లు షికారు చేయ‌డం దానికి టీమ్ నుంచి ఎలాంటి కౌంట‌ర్ లేక‌పోవ‌డం, సీక్వెల్ ఉంటుంద‌ని ఇండైరెక్ట్‌గా ఇంట్ ఇవ్వ‌డంతో అంతా సీక్వెల్ ఉంటుంద‌ని ఫిక్స్ అయ్యారు.

తాజాగా RRR సీక్వెల్‌పై సోష‌ల్ మీడియా వేదిక‌గా వ‌రుస క‌థ‌నాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌క్క‌న్న సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో భారీ పాన్ వ‌ర‌ల్డ్ మూవీని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. దాదాపు వెయ్యి కోట్ల భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి ప్ర‌ముఖ హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు. గ్లోబ‌ల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీ షూటింగ్ రాకెట్ స్పీడుతో సాగుతోంది. అయితే ఈ మూవీ త‌రువాత రాజ‌మౌళి RRR సీక్వెల్‌ని ప్రారంభిస్తాడ‌ని తాజాగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే ఈ ప్ర‌చారంలో ఏమాత్రం నిజం లేద‌ని తెలిసింది. జ‌క్క‌న్న RRRకు సీక్వెల్‌ని చేసేందుకు సిద్ధంగా లేర‌ని ఇన్ సైడ్ టాక్‌. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న `డ్రాగ‌న్‌`లో న‌టిస్తుండగా రామ్ చ‌ర‌ణ్ `పెద్ది` మూవీ చేస్తున్నాడు. సానా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగ‌తోంది. జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ మూవీకి ఏ.ఆర్‌. రెహ‌మాన్ సంగీతం అందిస్తున్నారు. క‌న్న‌డ స్టార్ హీరో శివ‌రాజ్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండా జ‌గ‌ప‌తిబాబు మ‌రో ప్ర‌ధాన పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. వ‌చ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ కానుంది.