Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్ తీరుకు ఎన్టీఆర్ అసహనం.. లండన్‌లో జరిగింది ఇదే!

కాన్సర్ట్ ముగిసిన తర్వాత బయట ఎన్టీఆర్‌కి సెల్ఫీ తీసుకోవాలని అభిమానులు ఊపిరాడకుండా ఎగబడినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   12 May 2025 7:17 PM IST
ఫ్యాన్స్ తీరుకు ఎన్టీఆర్ అసహనం.. లండన్‌లో జరిగింది ఇదే!
X

‘ఆర్ఆర్ఆర్’ లైవ్ కాన్సర్ట్ లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్‌లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి రాయల్ ఫిలార్మోనిక్ ఆర్కెస్ట్రాతో కలిసి పాటలు ఆలపించగా, దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ ఒకే వేదికపై దర్శనమిచ్చారు. ప్రత్యేకించి రామ్ చరణ్ తారక్‌ను హత్తుకొని ముద్దుపెట్టడం ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది.

ఈ స్టేజిపైన హీరోల మధ్య కనిపించిన ఆత్మీయత అభిమానుల హృదయాలను గెలుచుకుంది. ఎన్నో రోజుల తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సోషల్ మీడియా నిండుగా ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. రెండు వేర్వేరు కుటుంబాల నుండి వచ్చినా బిగ్ స్టార్స్, ఇద్దరూ స్నేహపూర్వకంగా కనిపించడం అభిమానులకు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. ‘నాటు నాటు’ పాట ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో ఈ లైవ్ కాన్సర్ట్ మరింత ప్రత్యేకంగా మిగిలింది.

అయితే, ఈ ఆనంద క్షణాల్లో ఒక చిన్న సంఘటన మాత్రం తారక్‌కి అసహనం తెప్పించింది. కాన్సర్ట్ ముగిసిన తర్వాత బయట ఎన్టీఆర్‌కి సెల్ఫీ తీసుకోవాలని అభిమానులు ఊపిరాడకుండా ఎగబడినట్లు తెలుస్తోంది. తారక్ అయితే ఎంతగానో ప్రయత్నించి అభిమానులను కూల్ చేయడానికి “వెయిట్ చేయండి, అందరికి సెల్ఫీలు ఇస్తా.. కానీ ఇలా చేస్తే భద్రతా సిబ్బంది మీని బయటకు పంపిస్తారు” అని శాంతంగా చెప్పినా వినిపించుకోలేదు.

వినిపించని పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది ఎన్టీఆర్‌ను వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు అభిమానులు తారక్‌పై ప్రేమతో ఇలా చేశామని చెబుతుండగా, మరికొందరు మాత్రం భద్రతా ప్రమాణాలపట్ల అభిమానులు కూడా బాధ్యతగా ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

హీరోలకంటే ముందు మనం వారి అభిమాని అని భావిస్తే, వారి గౌరవాన్ని కాపాడాలి అనేది నెటిజన్ల కామెంట్. ఈ ఘటన తారక్‌కు బాధ కలిగించిందని స్పష్టంగా కనిపిస్తోంది. అభిమానుల పట్ల ఆయన ఉన్న అభిమానంతో, ఓర్పుతో స్పందించిన తీరు మాత్రం చాలా మందిని ఆకట్టుకుంది. తారక్ అభిమానుల ప్రేమ పట్ల ఎప్పుడూ సానుకూలంగానే ఉంటారు. కానీ ఇలా చేస్తే ఎవరైనా సరే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఫ్యాన్స్ ఇలాంటి మూమెంట్స్ లో కాస్త ఓర్పుతో ఉంటే బెటర్.