Begin typing your search above and press return to search.

గ్లోబల్ స్టేజ్‌పై రాయల్ ఎన్‌ఫీల్డ్ పంజా.. ఫెరారీ, ఆడీలను దాటి మూడవ స్థానానికి!

అంతర్జాతీయ స్థాయిలో ఈ బ్రాండ్ సాధించిన విజయాలిలా ఉన్నాయి. టయోటా, బీఎండబ్ల్యూ తర్వాత స్థానంలో నిలిచి రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానాన్ని దక్కించుకుంది.

By:  Tupaki Desk   |   9 May 2026 6:00 PM IST
గ్లోబల్ స్టేజ్‌పై రాయల్ ఎన్‌ఫీల్డ్ పంజా.. ఫెరారీ, ఆడీలను దాటి మూడవ స్థానానికి!
X

ఒక భారతీయ బ్రాండ్ అంతర్జాతీయ వేదికపై ఫెరారీ, ఆడీ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలవడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే కేవలం ఒక బైక్ మాత్రమే కాదు.., అదొక ఎమోషన్ అని ఈ ఘనత మరోసారి నిరూపించింది. ‘బ్రాండ్ ఫైనాన్స్ 2026’ నివేదిక ప్రకారం మన దేశీయ ఆటోమొబైల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో లభించిన ఈ గుర్తింపు విశేషమైనది. ప్రఖ్యాత అంతర్జాతీయ బ్రాండ్లైన ఫెరారీ, ఆడీలను వెనక్కి నెట్టి భారతీయ దిగ్గజం ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ సంచలనం సృష్టించింది. ‘బ్రాండ్ ఫైనాన్స్-2026’ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఆటోమొబైల్ బ్రాండ్లలో ఇది మూడో (థర్డ్ ప్లేస్) స్థానాన్ని కైవసం చేసుకుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ అప్రతిహత విజయం

అంతర్జాతీయ స్థాయిలో ఈ బ్రాండ్ సాధించిన విజయాలిలా ఉన్నాయి. టయోటా, బీఎండబ్ల్యూ తర్వాత స్థానంలో నిలిచి రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ సంస్థ బ్రాండ్ విలువ గతేడాది కంటే ఏకంగా 30% పెరిగింది. వేగవంతమైన స్పోర్ట్స్ కార్లకు పేరొందిన ఫెరారీ, లగ్జరీ కార్ల దిగ్గజం ఆడీలను రాయల్ ఎన్‌ఫీల్డ్ వెనక్కి నెట్టి తన సత్తా చాటింది.

ఇతర భారతీయ బ్రాండ్ల దూకుడు

కేవలం రాయల్ ఎన్‌ఫీల్డ్ మాత్రమే కాకుండా ఇతర భారతీయ కంపెనీలు కూడా ఈ జాబితాలో మెరిశాయి. ఈ జాబితాలో టాటా మోటార్స్ ఐదో స్థానంలో నిలిచి తన గ్లోబల్ బ్రాండ్ పవర్ ను నిరూపించుకుంది. మహీంద్రా 25వ స్థానంలో, మారుతీ సుజుకీ 34వ స్థానంలో నిలిచి టాప్ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.

ఈ ఘనతకు కారణాలు

భారతీయ బ్రాండ్లు ఇంతటి విజయం సాధించడం వెనుక ప్రధాన కారణాలున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రాయల్ ఎన్‌ఫీల్డ్, టాటా ఉత్పత్తుల పట్ల ఉన్న నమ్మకం పెరిగింది. కేవలం భారత్‌లోనే కాకుండా ఆగ్నేయాసియా, యూరప్ దేశాల్లో కూడా ఈ బ్రాండ్ల విక్రయాలు భారీగా పెరిగాయి. పాత డిజైన్‌ను కాపాడుకుంటూనే ఆధునిక సాంకేతికతను జోడించడంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ సఫలీకృతమైంది.

ఒకప్పుడు విదేశీ కార్లు, బైక్‌ల వైపు చూసిన ప్రపంచం ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ల వైపు ఆకర్షితులవుతోంది. టయోటా, బీఎండబ్ల్యూ వంటి దిగ్గజాలకు మన కంపెనీలు గట్టి పోటీ ఇస్తుండటం భారత పారిశ్రామిక రంగానికి శుభపరిణామం.