Begin typing your search above and press return to search.

'ఫ్యామిలీ స్టార్'గా మెరిసిన రౌడీ స్టార్!

అయితే తొలి ఆట నుంచే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

By:  Tupaki Desk   |   5 April 2024 4:49 PM GMT
ఫ్యామిలీ స్టార్గా మెరిసిన రౌడీ స్టార్!
X

విజయ్ దేవరకొండ హీరోగా ప‌ర‌శురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ''ది ఫ్యామిలీ స్టార్''. ‘గీత గోవిందం’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన మూవీ ఇది. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ప్రమోషనల్ కంటెంట్ తో, అగ్రెసివ్ ప్రచార కార్యక్రమాలతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా, భారీ అంచనాలతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తొలి ఆట నుంచే ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు వెన్నెముకగా నిలుస్తూ, వారి ఉన్నతి కోసం పాటు పడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టార్లే అనే పాయింట్ తో 'ది ఫ్యామిలీ స్టార్' చిత్రాన్ని రూపొందించారు. ఫ్యామిలీ కోసం ఎంత దూర‌మైనా వెళ్లే గోవ‌ర్ధ‌న్ అనే యువ‌కుడు.. త‌నతో పాటు తన కుటుంబాన్ని అర్థం చేసుకున్న ఇందు అనే అమ్మాయి కోసం ఏం చేశాడు? మ‌ధ్య‌లో వ‌చ్చిన అపార్థాలు ఎలాంటి సంఘ‌ర్ష‌ణ‌కి కార‌ణ‌మ‌య్యాయి? అనేది ఈ సినిమాలో కీల‌కం. కుటుంబ వ్య‌వ‌స్థ గొప్పదనాన్ని చాటి చెప్పాలనుకున్న దర్శకుడు.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారని ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు. ఫస్టాఫ్ వరకూ బాగానే ఉన్నప్పటికీ, సెకండాఫ్ లో కథ పూర్తిగా గాడి తప్పిందని అంటున్నారు. కీలకమైన ద్వితీయార్థం విషయంలో జాగ్రత్తలు తీసుకొని ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యుండేదని కామెంట్లు చేస్తున్నారు.

'ఫ్యామిలీ స్టార్' సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, విజయ్ దేవరకొండ పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులు పడుతున్నాయి. కుటుంబ బాధ్యతల్ని నెత్తిన వేసుకుని కష్టపడే మిడిల్ క్లాస్ యువకుడి పాత్ర‌లో అతను ఒదిగిపోయాడు. రౌడీ బాయ్ ఇమేజ్ ఉన్న విజయ్.. గోవర్ధన్ లాంటి మ‌ధ్య త‌ర‌గ‌తి యువకుడి పాత్రలో మెప్పించగలిగాడు. ఫ్యామిలీ మ్యాన్ గా విజయ్ లుక్ బాగుంది. పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా క‌నిపిస్తూనే, మరోవైపు స్టైలిష్‌గానూ త‌న మార్క్‌ని ప్ర‌ద‌ర్శించాడు. చాలా వరకు సినిమాని తన భుజాల మీద మోశాడు. తన వరకూ పూర్తి న్యాయం చేసినప్పటికీ, పూర్తిగా కథ గాడి తప్పడంతో సినిమాను రక్షించలేకపోయాడని అంటున్నారు.

ఏదేమైనా 'ఫ్యామిలీ స్టార్' సినిమా వరకూ విజయ్ దేవరకొండ పెట్టిన సిన్సియర్ ఎఫర్ట్స్ ను మెచ్చుకోవాలి. ఇక ఈ మూవీ టాక్, రివ్యూలు ఎలా ఉన్నా.. ఫస్ట్ వీకెండ్ లో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే కాలేజీలు, స్కూల్స్ కి హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి, ఫ్యామిలీ ఆడియన్స్ - స్టూడెంట్స్ థియేటర్లకు వస్తారని ఆశిస్తున్నారు. మరి విజయ్ ఈ సినిమాని ఎక్కడ దాకా తీసుకెళ్లగలుగుతాడు? రాబోయే రెండు మూడు రోజుల్లో బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.