Begin typing your search above and press return to search.

రౌడీ స్టార్ కి అర్జెంట్ గా హిట్ పడాల్సిందే

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ నాని ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో లీడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

By:  Tupaki Desk   |   22 Nov 2023 3:58 AM GMT
రౌడీ స్టార్ కి అర్జెంట్ గా హిట్ పడాల్సిందే
X

అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అతికొద్ది మంది హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒకరు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ స్టార్ట్ చేసిన విజయ్ దేవరకొండ నాని ఎవడె సుబ్రహ్మణ్యం సినిమాతో లీడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లిచూపులు హీరోగా మొదటి సక్సెస్ అందుకున్నాడు. అర్జున్ రెడ్డితో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు.

అయితే ప్రస్తుతం విజయ్ దేవరకొండకి గడ్డుకాలం కొనసాగుతోందని చెప్పాలి. విజయ్ దేవరకొండ చివరి హిట్ టాక్సీవాలాతో 5 ఏళ్ళ క్రితం వచ్చింది. తర్వాత వచ్చిన డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి సినిమాలతో వరుసగా నాలుగు డిజాస్టర్స్ ని ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమాలు డిజాస్టర్ కావడం ఒక ఎత్తయితే ఈ సినిమాలతో విజయ్ ట్రోల్స్ కి కూడా గురయ్యాడు. ఖుషి కొంత వరకు అతని ఇమేజ్ ని కాపాడిన ఆశించిన సక్సెస్ రాలేదు.

గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నారు. అయితే అది భారీ బడ్జెట్ సినిమా కావడంతో నెమ్మదిగా జరుగుతోంది. ఈ మూవీ కంటే ఆలస్యంగా స్టార్ట్ చేసిన ఫ్యామిలీ స్టార్ ని ముందుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకొని శరవేగంగా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తున్నాడు.

ఫ్యామిలీ స్టార్ ను సంక్రాంతికి విడుదల చేసి భారీ సక్సెస్ తో ఫామ్ లోకి రావాలని అనుకుంటున్నారు. కాని పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా ఈ మూవీ సంక్రాంతికి విడుదల కావడం సాధ్యం కాదని సమ్మర్ లో రిలీజ్ ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తోంది. వరుస నాలుగు ఫ్లాప్ ల తర్వాత సక్సెస్ కోసం చాలా కసిగా విజయ్ చేస్తోన్న సినిమా ఫ్యామిలీ స్టార్ కావడం విశేషం.

ఇది సక్సెస్ అయితే మరల తన ఇమేజ్ ని బలంగా నిలబెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. లేదంటే గౌతమ్ తిన్ననూరి సినిమా కోసం మళ్ళీ వెయిట్ చేయాలి. మరి ఈ గడ్డుకాలం నుంచి రౌడీ స్టార్ బయట పడతాదా లీదా అనేది వేచి చూడాలి.