Begin typing your search above and press return to search.

కొత్త ద‌ర్శ‌కుడి కోసం రౌడీ స‌రికొత్త గెట‌ప్‌

ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ `జెర్సీ` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 12వ ప్రాజెక్ట్‌ని చేస్తున్నాడు.

By:  Tupaki Desk   |   13 Oct 2023 6:38 AM GMT
కొత్త ద‌ర్శ‌కుడి కోసం రౌడీ స‌రికొత్త గెట‌ప్‌
X

'లైగ‌ర్‌' డిజాస్ట‌ర్‌తో ఒక్క‌సారిగా షాక్‌కు గురైన రౌడీ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ దాని నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం కోసం చేసిన రొమాంటిక్ ల‌వ్ స్టోరీ 'ఖుషి'. శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ర‌వాలేదు అనిపించింది. భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని ద‌క్కించుకోవాల‌ని ప్లాన్ చేసుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు 'ఖుషి' ఊర‌ట క‌లిగించే విజ‌యాన్ని అందించింది. ఈ మూవీ త‌రువాత సినిమాల విష‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ స్పీడు పెంచారు.

'ఖుషి' ఫ‌లితాన్ని గ‌మ‌నించిన రౌడీ స్టార్ ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వీడీ 13ని క్రేజీ కాంబినేష‌న్‌లో మొద‌లు పెట్టేశాడు. ఈ మూవీని ప్ర‌ముఖ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో `సీతారామం` ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే షూటింగ్ మొద‌లు పెట్టి రాకెట్ స్పీడుతో షూటింగ్ పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇప్ప‌టికే షూటింగ్ దాదాపు యాభై శాతం పూర్తి చేసి ప‌రుగులు పెట్టిస్తున్నారు.

ప‌ర‌శురామ్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ల కాంబినేష‌న్‌లో గతంలో `గీత గోవిందం` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ రూపొందిన విష‌యం తెలిసిందే. వంద కోట్లు రాబ‌ట్టిన ఈ సినిమా త‌రువాత మ‌ళ్లీ వీరిద్ద‌రు క‌లిసి చేస్తున్న సినిమా ఇదే. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై స‌హ‌జంగానే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. రౌడీ, మృణాల్‌ల కాంబినేష‌న్ కూడా ఈ సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ `జెర్సీ` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో త‌న 12వ ప్రాజెక్ట్‌ని చేస్తున్నాడు.

ఇందులో ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న విజ‌య్ దేవ‌ర‌కొండ తాజాగా దిల్ రాజు బ్యాన‌ర్‌లో మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌ని ఓకే చేసిన‌ట్టుగా తెలుస్తోంది. దీనికి ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. 1980 నేప‌థ్యంలో సాగే మాఫియా క‌థాంశంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌పైకి రానున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో విజ్ దేవ‌ర‌కొండ ప‌వ‌ర్ ఫుల్ గ్యాంగ్ స్ట‌ర్‌గా క‌నిపిస్తార‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ద‌శ‌లో ఉన్న ఈ మూవీ టైటిల్‌తో పాటు పూర్తి వివ‌రాల్ని త్వ‌ర‌లోనే అధికారికంగా దిల్ రాజు టీమ్ ప్ర‌క‌టించ‌నుంద‌ని తెలిసింది.