Begin typing your search above and press return to search.

విజయ్ దేవరకొండ ఆలా చెయ్యాలిసిందే!

ఓ పక్క యువ హీరోలంతా కూడా రెండేసి సినిమాలు ఒకేసారి లైన్ లో పెడుతుంటే విజయ్ దేవరకొండ మాత్రం ఒక సినిమా పూర్తి చేసేదాకా మరో సినిమా చేయడం కుదరట్లేదు.

By:  Tupaki Desk   |   30 Jan 2024 3:22 PM GMT
విజయ్ దేవరకొండ ఆలా చెయ్యాలిసిందే!
X

యూత్ లో సూపర్ క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి గీతా గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టడంలో వెనకపడ్డాడు. అయితే ఆ సినిమాలతో వచ్చిన క్రేజ్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. లాస్ట్ ఇయర్ ఖుషితో ఓకే అనిపించిన విజయ్ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తున్నాడు. పరశురాం డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పక్కా హిట్ టార్గెట్ తో వస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరితో సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ స్టార్ పూర్తి చేసే వరకు గౌతం తిన్ననూరిని వెయిట్ చేయాల్సి ఉంది. విజయ్ చేస్తున్న ఫ్యామిలీ స్టార్ ఆల్రెడీ చివరి దశలోనే ఉంది. గౌతం తిన్ననూరి సినిమా ఇంకా మొదలు పెట్టలేదు. స్పై థ్రిల్లర్ గా వస్తున్న ఆ సినిమా త్వరలో స్టార్ట్ చేసినా కనీసం ఆరు నెలలు టైం తీసుకుంటుంది.

ఓ పక్క యువ హీరోలంతా కూడా రెండేసి సినిమాలు ఒకేసారి లైన్ లో పెడుతుంటే విజయ్ దేవరకొండ మాత్రం ఒక సినిమా పూర్తి చేసేదాకా మరో సినిమా చేయడం కుదరట్లేదు. అలా ఎందుకనేది తెలియదు కానీ విజయ్ దేవరకొండ కెరీర్ లో టాప్ గేర్ చేసి స్పీడ్ పెంచాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. రవితేజ లాంటి హీరోనే సినిమా వెంట సినిమా చేసి ఏడాదికి కనీసం రెండు రిలీజ్ లు ప్లాన్ చేస్తున్నాడు.

అలాంటిది విజయ్ దేవరకొండ ఏడాదికి ఒక్క సినిమాతో మాత్రమే వస్తున్నాడు. పోనీ చేసేది భారీ సినిమాలా అంటే అది కూడా కాదు. కచ్చితంగా విజయ్ దేవరకొండ తన సినిమాల వేగం పెంచితేనే బాగుంటుంది. లేదంటే మాత్రం కెరీర్ లో వెనకపడాల్సి వస్తుంది. ఫ్యామిలీ స్టార్ ని సమ్మర్ కి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తుండగా ఆ వెంటనే గౌతం తిన్ననూరి సినిమా సెట్స్ మీదకు వెళ్లినా ఇయర్ ఎండింగ్ కల్లా పూర్తి చేయగలిగితే బెటర్ లేదంటే మళ్లీ నెక్స్ట్ సమ్మర్ కే ఆ సినిమా రిలీజ్ అవకాశం ఉంటుంది. మరి విజయ్ కెరీర్ ప్లానింగ్ ఎలా చేస్తున్నాడో కానీ సినిమాల మధ్య లేట్ మాత్రం అతని ఫ్యాన్స్ ని టెన్షన్ లో పడేస్తుంది.