Begin typing your search above and press return to search.

కీడా కోలా హడావుడిలో సెంటిమెంట్ హీరో

పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండకు మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.

By:  Tupaki Desk   |   28 Oct 2023 7:20 AM GMT
కీడా కోలా హడావుడిలో సెంటిమెంట్ హీరో
X

పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపును అందుకున్న తరుణ్ భాస్కర్ ఇప్పుడు 13వ సినిమాతో కూడా సక్సెస్ అందుకొని మరో రేంజ్ కు వెళ్లాలని అనుకుంటున్నాడు. కీడా కోలా సినిమా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. ఇక 2వ తేదీన USA లో ప్రీమియర్లు ప్రదర్శించబడతాయి. ఇదిలా ఉంటే సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతుండగా చిత్ర యూనిట్ మరో హైప్ క్రియేట్ చేసింది.


హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌లో ఈ ఆదివారం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించేందుకు చిత్రబృందం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన కంటెంట్ సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతుంది. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మానందం నటిస్తూ ఉండడంతో ఆయన ఫ్యాన్స్ కూడా సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

విడుదలైన పోస్టర్లు టీజర్ ట్రైలర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేశాయి. ఇక తరుణ్ భాస్కర్ టీం గ్యాప్ లేకుండా వరుస ఇంటర్వ్యూలు చేస్తూ బిజీబిజీగా సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సినిమా ప్రమోషన్స్ లో చాలా కీలకంగా మారబోతోంది.

అయితే ఆ ఈవెంట్ కోసం దర్శకుడు తరుణ్ భాస్కర్ ఎప్పటిలానే తన సెంటిమెంట్ హీరోను రంగంలోకి దింపుతున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో విజయ్ దేవరకొండకు మొదటి బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. ఇక ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది సినిమాలో గెస్ట్ రోల్ చేయడమే కాకుండా ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా విజయ్ దేవరకొండ తన వంతు సహాయం చేశాడు.

అయితే ఇప్పుడు కీడా కోలా సినిమా కోసం కూడా విజయ్ దేవరకొండ రాబోతున్నాడు. దీంతో ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పడింది. విజయ్ దేవరకొండకు యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్నందున ఇది టీమ్‌కి గొప్ప వార్త. ఈ చిత్రంలో బ్రహ్మానందం వరదరాజులు తాతగా, చైతన్యరావు వాస్తుగా, రాగ్ మయూర్‌గా లాంచమ్‌గా, తరుణ్‌గా నాయుడుగా, సికిందర్‌గా విష్ణుగా, జీవన్‌కుమార్‌గా జీవన్‌రవీంద్ర విజయ్‌గా, షాట్స్‌గా రఘురామ్‌గా కనిపించనున్నారు.