Begin typing your search above and press return to search.

రౌడీబోయ్ రింగులోకి దిగేస్తాడు!

అయితే పెళ్లి తంతు ముగిసిన నేప‌థ్యంలో అశిష్ మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్ట‌నున్నాడు.

By:  Tupaki Desk   |   25 Feb 2024 1:30 AM GMT
రౌడీబోయ్ రింగులోకి దిగేస్తాడు!
X

దిల్ రాజు త‌మ్ముడు కుమారుడు అషిశ్ రెడ్డి ఇటీవ‌ల వివాహం తో ఓ ఇంటివాడైన సంగ‌తి తెలిసిందే. ఈవివాహం కార‌ణంగా అషిశ్ క‌మిట్ అయిన సినిమాల‌న్నిహోల్డ్ లో ప‌డ్డాయి. కొన్ని ప్రారంభ‌మై రెగ్యుల‌ర్ షూట్ కి రెడీగా ఉండ‌గా..కొన్ని చిత్రీక‌ర‌ణ మ‌ధ్య‌లోనూ ఆగిపోయాయి. అషిశ్ పెళ్లి బిజీలో ప‌డి ఆ సినిమాల్ని ప‌ట్టించుకుంది లేదు. అయితే పెళ్లి తంతు ముగిసిన నేప‌థ్యంలో అశిష్ మ‌ళ్లీ సినిమాల‌పై ఫోక‌స్ పెట్ట‌నున్నాడు.

ప్ర‌స్తుతం అశిష్ హీరోగా `సెల్ఫిష్` అనే సినిమా తెర‌కెక్కుతోంది. ఇందులో ఇవానా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా చాలా కాలంగా సెట్స్ లోనే ఉంది. ఔట్ ఫుట్ విష‌యంలో కాన్పిడెంట్ గా లేక‌పోవ‌డంతో ఈ సినిమా రీషూట్ చేసారు. అది మొత్తం పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లోనే విడుద‌ల తేదీని ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. ఇది అశిష్ రెండ‌వ సినిమాగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఇక మూడ‌వ చిత్రాన్ని ఈ సినిమా సెట్స్ లో ఉండ‌గానే గ‌త ఏడాది లాంచ్ చేసిన సంగ‌తి తెలిసిందే.

హార‌ర్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీతో అరుణ్ అనే డైరెక్ట‌ర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఎమ్ ఎమ్ కీర‌వాణి సంగీతాన్ని అందిస్తోండ‌గా.. నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ సినిమాటోగ్రాఫ‌ర్ పీసీ శ్రీరామ్ కెమెరామెన్ గా బాధ్య‌త‌ల్ని తీసుకున్నారు.

దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ లోనే సినిమా నిర్మాణం జ‌రుగుతుంది. ఈ సినిమా ఏకంగా గ‌త ఏడాది ఆగ‌స్టులో లాంచ్ అయింది. ఇప్ప‌టి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ కి వెళ్లింది లేదు. అయితే సెల్పీష్ రీ షూట్ కార‌ణంగానే చాలా స‌మ‌యం వృద్ధా అయింది.

ఇంత‌లో అశిష్ పెళ్లి కార‌ణంగా మ‌రింత ఆల‌స్య‌మైంది. అయితే అశిష్ పెళ్లి తంతు పూర్తిచేసాడు కాబ‌ట్టి హ‌నీమూన్ అనంత‌రం యంగ్ హీరో షూటింగ్ లు పూర్తిచేసే ప‌నిలోనే ఉంటాడ‌ని తెలుస్తోంది. ఇక‌పై మ‌రింత బాధ్య‌త‌గానూ వ్య‌వ‌హ‌రించాల్సి ఉంటుంది. తొలి సినిమా రౌడీ బోయ్స్ తో న‌టుడిగా పాస్ అయ్యాడు. న‌ట‌న‌లో ఈజ్ న‌టుడు. అత‌డి నుంచి ఇంకా మంచి ఔట్ ఫుట్ తీసుకోడానికి ఛాన్స్ ఉంది. తాజా సినారాలో అటు ఫ్యామిలీ..ఇటు ప్రోఫెష‌న్ రెండింటినీ బ్యాలెన్స్ చేయాల్సి ఉంది.