Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ నోట్‌ అంచ‌నాల్ని పెంచేస్తోందే!

రౌడీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న పీరియాడిక్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా `రౌడీ జ‌నార్ధ‌న‌`. కీర్తి సురేష్ తొలి సారి రౌడీకి జ‌డీగా న‌టిస్తోంది.

By:  Tupaki Desk   |   19 Dec 2025 12:27 AM IST
డైరెక్ట‌ర్ నోట్‌ అంచ‌నాల్ని పెంచేస్తోందే!
X

రౌడీ హీరో విజ‌య్‌దేవ‌ర‌కొండ న‌టిస్తున్న పీరియాడిక్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ డ్రామా `రౌడీ జ‌నార్ధ‌న‌`. కీర్తి సురేష్ తొలి సారి రౌడీకి జ‌డీగా న‌టిస్తోంది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వారి బ్యాన‌ర్‌లో వ‌స్తున్న 59వ ప్రాజెక్ట్ ఇది. ర‌వికిర‌ణ్ కోలా డైరెక్ట‌ర్‌. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో సాగ‌నుంది. ప్ర‌స్తుతం రాకెట్ స్పీడ్‌తో షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈమూవీ టైటిల్ గ్లింప్స్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ క్యారెక్ట‌ర్ లుక్‌ని కూడా రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఈ సంద‌ర్భంగా రిలీజ్ చేసిన డైరెక్ట‌ర్ నోట్ వీడియో సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా తాను ఎలాంటి సినిమాని తెర‌కెక్కిస్తున్నాడో తెలియ‌జేస్తూ `డైరెక్ట‌ర్ నోట్` పేరుతో గురువారం ఓ స్పెష‌ల్ వీడ‌యోని విడుద‌ల చేశాడు ద‌ర్శ‌కుడు ర‌వికిర‌ణ్ కోలా. సెట్‌లో డైరెక్ట‌ర్‌పై ఓపెన్ అయిన వీడియో ఎండ్ కు వ‌చ్చే స‌రికి చేతిక క‌డియం..ర‌క్తం ఓడుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ హ్యాండ్‌పై ఎండ్ అయిన తీరు సినిమాపై ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

`ఎప్ప‌టి నుంచో ఈ క‌థ చెప్పాల‌నుకుంటున్నాను. ఒక మ‌నిషి గురించి..ఐ ఫౌండ్ హిమ్ ఇన్ మై మెమ‌రీ. హీ ఈజ్ వెరీ ప‌ర్స‌న‌ల్‌...చిన్న‌ప్ప‌టి నుంచి చూస్తూ పెరిగాను. అత‌ను ప‌ర్‌ఫెక్ట్ కాదు..కానీ అత‌ను రియ‌ల్‌. ఫ్లాడ్‌..హాంగ్రీ..ఉండెడ్‌...ఎంత హేట్ చేశానో అంత కంటే ఎక్కువ ల‌వ్ చేశాను. అండ్ ఐ న్యూ దిల్ స్టోరీ హాడ్ టు బి టోల్డ్‌. మీక్కూడా ప‌రిచ‌యం చేస్తాను. అంటూ త‌న నోట్‌ని ముగించాడు డైరెక్ట‌ర్ ర‌వి కిర‌ణ్ కోలా..

ఆ ఎండ్ విజువ‌ల్స్‌లో ర‌క్తం ఓడుతున్న విజ‌య్ దేవ‌ర‌కొండ హ్యాండ్ సినిమా ఏ స్థాయిలో ఉండ‌నుంది, రౌడీ క్యారెక్ట‌రైజేష‌న్ ఎంత ప‌వ‌ర్ ఫుల్‌గా డిజైన్ చేశాడో అర్థ‌మ‌వుతోంది. మ‌ళ్లీ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న మార్కు సినిమాతో రాబోతున్నాడ‌నే సంకేతాల్ని ఈ డైరెక్ట‌ర్ నోట్ స్పెష‌ల్ మీడీయో చెప్ప‌క‌నే చెప్పేయ‌డంతో రౌడీ ఫ్యాన్స్‌లో హంగామా మొద‌లైంది. రౌడీ మార్కు సినిమా కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి `రౌడీ జ‌నార్ధ‌న‌` ఫుల్ జోష్‌ని అందించ‌డం ఖాయం అని అంటున్నారు.

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ తో పాటు, విజ‌య్ దేవ‌ర‌కొండ క్యారెక్ట‌ర్ ని కూడా రివీల్ చేయ‌డానికి టీమ్ ముహూర్తం ఫిక్స్ చేసింది. డిసెంబ‌ర్ 22న రాత్రి 7:29 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌బోతోంది. ఈ సినిమాతో విజ‌య్ దేవ‌ర‌కొండ పాన్ ఇండియా లెవెల్లో త‌న స‌త్తా చాట‌డానిక ఇరెడీ అవుతున్నాడు. విజువ‌ల్స్ చూస్తుంటే ఈ సారి అనుకున్న‌ది సాధించేలానే ఉన్నాడ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.