Begin typing your search above and press return to search.

నల్లగా ఉంటాడు వీడు హీరోనా?

నేను చాలా సార్లు విన్నాను. నా వెనుక చాలా మంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. బ్లాక్ గా ఉంటాడు వీడు హీరోనా? అని అన్నారు. అసలు హీరో మెటీరియలే కాదు అని కామెంట్ చేశారు.

By:  Tupaki Desk   |   25 Dec 2023 4:39 AM GMT
నల్లగా ఉంటాడు వీడు హీరోనా?
X

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం బబుల్ గల్. యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 29వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం.. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ గ్రాండ్ గా నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరోలు అడవి శేష్‌, విశ్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ చీఫ్ గెస్ట్లుగా హాజరయ్యారు. చిత్రం మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. సుమనే వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి రోషన్ కుటుంబసభ్యులంతా వచ్చారు. వేడుకను ఉద్దేశించి రోషన్ కనకాల మాట్లాడుతూ.. తనను ట్రోల్ చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.

"నేను చాలా సార్లు విన్నాను. నా వెనుక చాలా మంది రకరకాలుగా మాట్లాడుకున్నారు. బ్లాక్ గా ఉంటాడు వీడు హీరోనా? అని అన్నారు. అసలు హీరో మెటీరియలే కాదు అని కామెంట్ చేశారు. కానీ నేను ఇలానే పుట్టాను. ఇలానే ఉంటాను. ఒక మనిషిని అందం, కలర్ కాదు బ్రదర్.. హార్డ్ వర్క్, సక్సెస్, టాలెంట్ మాత్రమే డిసైడ్ చేస్తాయి"

"మన అందరి తల రాత ఎలా ఉంటుందో తెలియదు. కానీ మనకు నచ్చినట్లు మార్చుకుందాం. కావాల్సింది పోరాడి తెచ్చుకుందాం. అది పరువు అయినా, విలువ అయినా. ప్రతి మనిషికి ఒక రోజు వస్తుంది. డిసెంబర్ 29వ తేదీ రాసిపెట్టుకోండి. థియేటర్లకు వచ్చేయండి. ఆది గాడి లవ్ ను చూడండి. ఫైట్ ఫర్ రిస్పెక్ట్ ను చూడండి" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు రోషన్.

ఈ సినిమా నుంచి రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ మూవీ పై మరింత క్యూరియాసిటీ పెంచేసింది. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవికాంత్ పేరేపు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. రోషన్, మానసతో పాటు హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ప్రియురాలి వల్ల అవమానం ఎదుర్కొన్న ఓ యువకుడు.. జీవితంలో ఎలా ముందుకు వెళ్లాడు, ఏ విధంగా ఆమెపై రివెంజ్‌ తీర్చుకున్నాడు అనే క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. మరి తొలి సినిమాతో రోషన్ హిట్ అందుకుంటారో లేదో చూడాలి.