రోషన్ ను తక్కువ అంచనా వేయలేం
రోషన్ మొదటి మూవీ అతను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే వచ్చింది.
By: Tupaki Desk | 20 April 2025 2:30 PMమామూలుగా ఎవరి వారసులైనా ఇండస్ట్రీలోకి వస్తుంటే చాలా హడావిడి చేస్తుంటారు. తమ పరిచయాలు మొత్తం వాడి తమ వారసుల కోసం మంచి డైరెక్టర్ ను సెట్ చేయడం దగ్గర నుంచి క్యాస్టింగ్, బ్యానర్ ఇలా ప్రతీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ సీనియర్ హీరో శ్రీకాంత్ మాత్రం తన కొడుకు రోషన్ విషయంలో అలాంటి ప్లాన్స్ ఏమీ చేయలేదు.
రోషన్ మొదటి మూవీ అతను చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే వచ్చింది. నిర్మలా కాన్వెంట్ పేరుతో రోషన్ చేసిన మొదటి సినిమాను అన్నపూర్ణ బ్యానర్‌లో అక్కినేని నాగార్జున నిర్మించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవకపోయినప్పటికీ మంచి టాక్ తెచ్చుకుంది. అదే సినిమా ఈ రోజుల్లో వచ్చి ఉంటే మంచి సినిమా అవడంతో పాటూ కచ్ఛితంగా హిట్ గా కూడా నిలిచేది.
ఇక రెండో సినిమాగా పెళ్లి సందడి సినిమాను రాఘవేంద్రరావు తో చేసి మంచి హిట్ అందుకున్నాడు రోషన్. ఆ సినిమాలో సాంగ్స్, శ్రీలీల డ్యాన్సులు, రోషన్ లుక్స్ పెళ్లిసందడిని మంచి సినిమాగా నిలిపాయి. ఆ సినిమా హిట్ అయినప్పటికీ రోషన్ నుంచి ఇప్పటివరకు వరకు మరో సినిమా వచ్చింది లేదు. సక్సెస్ అందుకున్నప్పటికీ రోషన్ నుంచి ఇంకా సినిమా రాకపోవడమేంటని అందరూ ఆశ్చర్యపోతున్నారు.
అయితే రోషన్ ప్రస్తుతం మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాడు. దాంతో పాటూ వైజయంతీ మూవీస్ లో మరో సినిమా చేస్తున్నాడు. ముప్పా అశోక్ నిర్మాతగా ఓ సినిమా డిస్కషన్స్ లో ఉన్నట్టు టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా ఆయన నిర్మాతగా అర్జున్ సన్నాఫ్ వైజయంతీ సినిమా వచ్చింది. మొత్తానికి ఎలాంటి హడావిడి లేకుండా రోషన్ చాలా నెమ్మదిగా, సైలెంట్ గా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న దాన్ని బట్టి చూస్తే రోషన్ ను తక్కువ అంచనా వేయడానికి లేదనిపిస్తోంది.