మరో ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రోషన్ మేక.. ఏకంగా ఆమెను రంగంలోకి!
ఇప్పటికే 'ఛాంపియన్' సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే 'ఏమో ఏమో ఇది'.
By: Madhu Reddy | 14 Feb 2026 3:56 PM ISTఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు బడా ప్రాజెక్టులతో వరుస సినిమాలు చేస్తూ ఎంత బిజీగా అయితే గడుపుతున్నారో.. ఇటు చిన్న హీరోలు కూడా వరుస సినిమాలు చేస్తూ యూత్ ను.. ముఖ్యంగా జెన్ జీ టార్గట్ గా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. యాక్షన్ థ్రిల్లర్ తో పాటు లవ్ రొమాంటిక్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరో కం విలన్ శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 'ఛాంపియన్' సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈయన.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అదే 'ఏమో ఏమో ఇది'.
శైలేష్ కొలను దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా వస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇందులో ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా ఎంపికయింది. ఈరోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా నుండి చిత్ర బృందం "ది ఫస్ట్ బ్రీజ్" పేరుతో ఒక చిన్న గ్లింప్స్ విడుదల చేసింది. బయట అమ్మాయిలు ఎలా ఉన్నారో తెలుసా అంటూ రోషన్ జెన్ జీ పదాలు చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి అయితే ఛాంపియన్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రోషన్ మేక.. ఇప్పుడు 'ఏమో ఏమో ఇది' అనే ఒక రొమాంటిక్ కామెడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రీతి ముకుందన్ విషయానికి వస్తే.. ఇటీవల మంచు విష్ణు ప్రెస్టేజియస్ మూవీగా తెరకెక్కిన కన్నప్ప సినిమాలో లీడ్రోల్ పోషించి అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ చిన్నది . ఇప్పుడు యంగ్ హీరో రోషన్ మేక హీరోగా వస్తున్న ఈ చిత్రంతో హీరోయిన్గా ఎంపికవడంతో ప్రీతి కాస్త మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చిందని చెప్పవచ్చు.
భరతనాట్యంలో ప్రావీణ్యం పొందిన ప్రీతి ముకుందన్ శ్రీకాళహస్తి స్థల పురాణ నేపథ్యంలో వచ్చిన పాన్ ఇండియా చిత్రం కన్నప్ప తోనే హీరోయిన్గా మంచి పేరు అందుకుంది. ఈమె 2000 జూలై 30 తమిళనాడులోని తిరుచ్చిలో జన్మించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచ్చి నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసిన ఈమె.. తన అద్భుతమైన నటనతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకుంది. 2024లో ఓం భీమ్ పుష్ అనే చిత్రంతో సినీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
చిన్న వయసు నుండే నాట్యంలో శిక్షణ పొందిన ఈమె హిప్ హాప్, సినీ, జానపదం, పాశ్చాత్య , ఫ్యూజన్ వంటి విభిన్న రూపాలలో డాన్స్ చేస్తూ వివిధ సాంస్కృతిక కార్యకలాపాలలో నృత్య నైపుణ్యాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకుంది. అటు మోడలింగ్ రంగంతో పాటు అనేక టీవీ యాడ్స్ లో కూడా నటించింది. అంతేకాదు వార్తా ప్రకటనలలో కూడా కనిపించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది ప్రీతి ముకుందన్.
