Begin typing your search above and press return to search.

ఫోర్బ్స్ 2025 బిలియ‌నీర్ల జాబితాలో ఏకైక‌ సినీదిగ్గ‌జం

బాలీవుడ్ నిర్మాత‌, మీడియా దిగ్గ‌జం రోనీ స్క్రూవాలా ఫోర్బ్స్ 2025 బిలియ‌నీర్స్ జాబితాలో చోటు సంపాదించారు.

By:  Tupaki Desk   |   5 April 2025 3:00 PM IST
Ronnie Screwvala Becomes First Bollywood Billionaire on Forbes 2025 List
X

బాలీవుడ్ నిర్మాత‌, మీడియా దిగ్గ‌జం రోనీ స్క్రూవాలా ఫోర్బ్స్ 2025 బిలియ‌నీర్స్ జాబితాలో చోటు సంపాదించారు. బాలీవుడ్ నుంచి ఈ ఘ‌న‌త సాధించిన మొద‌టి ప్ర‌ముఖుడు ఆయ‌న‌. 1.5 బిలియ‌న్ల డాల‌ర్ల నిక‌ర ఆస్తుల‌తో రోనీ స్క్రూవాలా... భార‌తీయ వినోద ప‌రిశ్ర‌మ నుంచి బిలియ‌నీర్ క్ల‌బ్ లో చేరిన ఏకైక సినీనిర్మాత‌గా, వ్య‌వ‌స్థాప‌కుడిగా చ‌రిత్ర సృష్టించారు.

ముగ్గురు దిగ్గ‌జాలైన ఖాన్‌ల త్ర‌యం నిక‌ర ఆస్తుల‌న్నిటినీ రోనీ అధిగ‌మించాడు. షారుఖ్ ఖాన్ నిక‌ర ఆస్తి 770 మిలియన్ డాల‌ర్లు, సల్మాన్ ఖాన్ నిక‌ర ఆస్తి 390 మిలియన్ డాల‌ర్లు.. ఆమిర్ ఖాన్ నిక‌ర ఆస్తి 220 మిలియన్ డాల‌ర్లు క‌లుపుకున్నా..ఈ మొత్తం సంప‌ద‌ 1.38 బిలియన్ డాల‌ర్లు మాత్ర‌మే. అంత‌కుమించి రోనీ స్క్రూవాలా కూడ‌గ‌ట్టారు.

సినిమాలు, ఎంట‌ర్ టైన్ మెంట్ స‌హా విభిన్న‌ వ్య‌వ‌స్థాప‌క రంగంలో రాణిస్తే ఎలాంటి ఫ‌లితం సాధించ‌గ‌ల‌రో రోనీ ఎదుగుద‌ల చెబుతోంది. ఒక ర‌కంగా వినోద రంగంలో భారీ ఎదుగుద‌ల‌కు ఆస్కారం ఉంద‌నే అంశాన్ని ఇది గుర్తు చేస్తోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ లో వంద‌ల కోట్ల ఆస్తులు ఉన్న స్థితిమంతులు ఉన్నారు. వీరంతా వ్య‌వ‌స్థాప‌క- వినోద రంగాల్లో ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తున్నందున మునుముందు ఇండియాలో బిలియ‌నీర్లు ఇంకా పెరిగే అవ‌కాశం ఉంది.