2 నెలల్లో నటుడిలో భారీ శారీరక మార్పులు
చక్రవర్తి సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్, జూన్ 4 నుండి ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 7:30 గంటలకు ప్రీమియర్ కానుంది.
By: Tupaki Desk | 5 Jun 2025 6:30 AM ISTఎంపిక చేసుకున్న పాత్ర కోసం బరువు తగ్గాల్సి వస్తే తారలు దానికోసం చాలా శ్రమించాలి. జిమ్ యోగా ఇతర కసరత్తులు అవసరం అవుతాయి. అలాగే ఆహార నియమాల్ని రెగ్యులర్ గా పాటించాలి. అలాంటి కఠినమైన నియమాన్ని పాటిస్తూ కేవలం రెండు నెలల్లో 8 కేజీలు తగ్గానని తెలిపారు నటుడు రోనిత్ రాయ్. అతడు పృథ్వీరాజ్ మహారాజ్ జీవితకథతో రూపొందుతున్న చిత్రంలో చక్రవర్తి తండ్రి రాజు సోమేశ్వర్ పాత్రను పోషిస్తున్నారు.
చక్రవర్తి సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్, జూన్ 4 నుండి ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 7:30 గంటలకు ప్రీమియర్ కానుంది. పృథ్వీరాజ్ చౌహాన్ స్ఫూర్తిదాయకమైన జర్నీకి సంబంధించిన చిత్రమిది. అతడు అమాయక యువరాజు నుండి భారతదేశపు అత్యంత ధైర్యవంతులైన రాజులలో ఒకరిగా మారిన విధానాన్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. చిన్న వయసులోనే పట్టాభిషిక్తుడైన పృథ్వీరాజ్ చౌహాన్ దేశాన్ని రక్షించడంలో అచంచలమైన అంకితభావం కనబిచిన వీరుడిగా ఘనుతికెక్కారు.. నేటికీ చరిత్రలో గొప్ప విలన్లలో ఒకరైన ముహమ్మద్ ఘోరీ, పృథ్వీరాజ్ చౌహాన్ మధ్య జరిగిన మహా యుద్ధం చాలా మంది హృదయాల్లో గర్వాన్ని ఉప్పొంగేలా చేస్తుంది. పృథ్వీరాజ్ కథను సజీవంగా తెరపైకి తీసుకు వస్తున్నారు రోనిత్ రాయ్. కేవలం తన పాత్ర కోసం 8కేజీలు తగ్గేందుకు చాలా శ్రమించాడు.
రెండు నెలల వ్యవధిలో, కఠినమైన అత్యంత క్రమశిక్షణ కలిగిన ఫిట్‌నెస్ నియమావళి ద్వారా నేను 8 కిలోల బరువును కోల్పోయాను. ప్రతి రోజూ ఉదయం ఎనర్జీ శిక్షణా సెషన్ ఉంటుంది. తరువాత సాయంత్రం తీవ్రమైన కార్డియో వ్యాయామాలు చేసాను అని అతడు తెలిపారు.
