Begin typing your search above and press return to search.

పెద్ద నిర్మాత బ‌ల‌వంతం చేసాడు.. న‌టుడి ఆరోప‌ణ‌!

నిజాయితీగా చెప్పాలంటే ఇది టచ్‌వుడ్.. నా జీవితమంతా నేను అందమైన వ్యక్తులను కలిశాను. చాలా మంచి ప్రొఫెషనల్ వ్యక్తులను కలిశాను.

By:  Tupaki Desk   |   14 May 2025 4:18 PM
పెద్ద నిర్మాత బ‌ల‌వంతం చేసాడు.. న‌టుడి ఆరోప‌ణ‌!
X

పెద్ద నిర్మాత బ‌ల‌వంతం చేసాడు.. ఆ అవ‌కాశం కావాలంటే అదొక్క‌టే నువ్వు చేయాల్సింది అన్నాడు!!! అత‌డు ఎవ‌రు? అంటే.. స్టార్ ప్లస్ పాపుల‌ర్ షో 'యే రిష్టా క్యా కెహ్లతా హై' నటుడు రోమిత్ రాజ్ ఎప్పుడూ వివాదాలతో మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తాడు. అత‌డు త‌న మాజీ ప్రేయ‌సి నుంచి విడిపోయిన విష‌యాన్ని, అలాగే త‌నను అవ‌కాశాల పేరుతో మ‌భ్య పెట్టిన ఒక స్టార్ ప్రొడ్యూస‌ర్ అనుచిత ప్ర‌వ‌ర్త‌నను గుర్తు చేసుకున్నాడు.

'బిగ్ బాస్' ఫేమ్ శిల్పా షిండేతో విడిపోయిన విష‌యాన్ని అత‌డు స్వ‌యంగా అంగీక‌రించాడు. ఆమెతో ఆరోజు విడిపోవ‌డం తెలివైన నిర్ణ‌య‌మ‌ని కూడా అన్నాడు. సిద్ధార్థ్ క‌న్న‌న్‌తో ఇంట‌ర్వ్యూలో రోమిత్ రాజ్ షాకింగ్ కాస్టింగ్ కౌచ్‌ను గుర్తుచేసుకున్నాడు. ఒక టాప్ క్రియేటివ్ ఫిలింమేక‌ర్ తనను 'ఆ పాత్ర కోసం ఏదైనా చేయాల్సి ఉంటుంది' అని అడిగాడ‌ని గుర్తు చేసుకున్నాడు.

నిజాయితీగా చెప్పాలంటే ఇది టచ్‌వుడ్.. నా జీవితమంతా నేను అందమైన వ్యక్తులను కలిశాను. చాలా మంచి ప్రొఫెషనల్ వ్యక్తులను కలిశాను. కాబట్టి ఎవరూ నాతో తప్పుగా ప్రవర్తించలేదు. ఎల్లప్పుడూ నా పని నాకు అవ‌కాశాలు కల్పించింది.. అని అన్నాడు. కానీ అత‌డు ఓ పెద్ద నిర్మాత‌... ఆ అవ‌కాశం కావాలంటే నాతో ప‌క్క పంచుకోవాలి అని అడిగాడు. కానీ నా ప్ర‌తిభ‌ ఆధారంగా మీరు నన్ను ఎంపిక చేసుకోవచ్చు..నన్ను ఆడిషన్ చేయవచ్చు.. నేను ఆ పాత్రకు సరిపోతానని అనుకుంటే ఎంపిక చేయండి! అని అడిగిన‌ట్టు తెలిపాడు. నా తండ్రి ఎప్పుడూ చెప్పేది.. మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారో మీకు తెలియదు. కాబట్టి మీ పని మీరు చేస్తూ నిరూపించుకోవాల‌ని సూచించారు. కానీ పేరున్న బ‌డా నిర్మాత నాపై అస‌భ్య‌క‌రంగా ఒత్తిడి చేసాడ‌ని తెలిపాడు.