Begin typing your search above and press return to search.

ప్రేయ‌సికి షాక్ ఇచ్చిన హిట్ మ్యాన్!

హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌-రితిక దంప‌తుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసు కున్నారు.

By:  Tupaki Desk   |   22 April 2025 4:00 PM IST
Rohit Sharma Hilarious Pre-Marriage Prank
X

హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ‌-రితిక దంప‌తుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసు కున్నారు. క్రికెట్ లో రితిక అంత యాక్టివ్ కాదు. అప్పుడ‌ప్పుడు హ‌బ్బీ ఆడే మ్యాచ్ ల్లో క‌నిపిస్తుంది. ఫ్యామిలీ టైమ్ లో రోహిత్ తో క‌లిసి గ్యాల‌రీలో అభిమానుల్ని అల‌రిస్తుంటారు. తాజాగా రోహిత్ తో పెళ్లికి ముందు అత‌డు ఓ బిగ్ షాక్ ఇచ్చిన విష‌యం రితిక రివీల్ చేసింది. అదేంటో ఆమె మాట‌ల్లోనే.. `రోహిత్ చాలా స‌ర‌దాగా మ‌నిషి.

ఇంట్లో ఉన్న‌తం సేపు న‌వ్వుతుంటాడు. న‌న్నెప్పుడు ఆట ప‌ట్టిస్తుంటాడు. మేమిద్దరం కొంత కాలం డేటింగ్ చేసాక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాల‌నుకున్నాం. అదే స‌మ‌యంలో మా అమ్మ వంట వ‌చ్చిన అమ్మాయిని మాత్ర‌మే అంగీక‌రిస్తుంది. వంట రాక‌పోతే ఒప్పుకోదని కండీష‌న్ పెట్టాడు. నీకేమో వంట రాదు. ఇప్పుడేం చేద్దాం అన్నాడు. కాసేప‌టికి పెళ్లి వ‌ద్దు వ‌దిలేద్దాం ఇక్క‌డితోనేని షాక్ ఇచ్చాడు.

ఇదేంటి ఇలా అంటున్నాడు? ఇలాంటి స్వ‌భావం గ‌ల వాడిని ప్రేమించానా? చాలా పెద్ద త‌ప్పు చేసాన‌ని లోప‌ల నుంచి దుఖం త‌న్నుకొస్తుంది. ప‌ట్ట‌రాని కోపం కూడా త‌రుముకొస్తుంది. ఇదంతా నిజ‌మ‌నుకున్ని తెగ ఏడుస్తున్నాను. ఆ కాసేప‌టికి విష‌యం చెప్ప‌కుండా ప‌కా ప‌కా న‌వ్వుతూ ఇదంతా ప్రాంక్ అన్నాడు. ఆ స‌మ‌యంలో దుఖం పోయి కోపం పెరిగి కాసేప‌టికి కూల్ అయ్యాను.

అప్ప‌టి నుంచి ఇలాంటి ప్రాంక్ లు కామ‌న్ గా మారిపోయాయి. రోహిత్ నిజం చెప్పినా? ఇప్పుడు న‌మ్మ‌డం లేదు. తిరిగి ఇదంతా ప్రాంక్ క‌దా అంటున్నాను. ఇప్పుడు నిజ‌మని న‌మ్మించ‌డం రోహిత్కి ఇబ్బందిగా మారింది. వ‌న్య‌ప్రాణులంటే ఇష్టం. ఇంట్లో పాప‌కి వాటి గురించి చెబుతుంటాడు. ఖాళీ ఉంటే ఇద్ద‌రు క‌లిసి జూకి వెళ్లిపోతుంటారు` అని తెలిపింది.