ఆ కారణంతోనే కంఖుజారాకు బజ్ లేదా?
కంఖుజారా సిరీస్ చూసిన వాళ్లంతా మాథ్యూ యాక్టింగ్ గురించి తెగ ప్రశంసిస్తున్నారు.
By: Tupaki Desk | 5 Jun 2025 7:00 PM ISTఓ మలయాళ స్టార్ బాలీవుడ్ ఓటీటీ వెబ్ సిరీస్ లో మేజర్ రోల్ చేయడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. రీసెంట్ గా రిలీజైన వెబ్ సిరీస్ కంఖుజారా ద్వారా మలయాళ సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్న రోహన్ మాథ్యూ హిందీ ఓటీటీలోకి అడుగుపెట్టాడు. ఈ సిరీస్ లో ఆల్రెడీ బాలీవుడ్ లో పేరు తెచ్చుకున్న మోహిత్ రైనాతో మాథ్యూ స్క్రీన్ ను షేర్ చేసుకున్నాడు.
ఈ సిరీస్ లో రోహన్ తనదైన శైలిలో నటించడమే కాకుండా చాలా సీన్స్ లో తన కో స్టార్ అయిన రైనా యాక్టింగ్ ను కూడా డామినేట్ చేశాడు. సిరీస్ లో రోహన్ చేసిన క్యారెక్టర్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. దానికి తగ్గట్టే రైనా నటనలో, మాథ్యూ నటనలో ఉన్న ఇంటెన్సిటీ, కాన్ఫిడెన్స్ కనిపించ లేదు. కేవలం భాషతో మాత్రమే కాకుండా మాథ్యూ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో కూడా అందరినీ ఆకట్టుకున్నాడు.
కంఖుజారా సిరీస్ చూసిన వాళ్లంతా మాథ్యూ యాక్టింగ్ గురించి తెగ ప్రశంసిస్తున్నారు. అంతేకాదు, ఈ సిరీస్ లో మాథ్యూ పెర్ఫార్మెన్స్ ముందు మోహిత్ రైనా యాక్టింగ్ తేలిపోయింది. అయితే సిరీస్ ను చూసిన వారు మెచ్చుకుంటున్నారు తప్పించి కంఖుజారా కు ఎక్కడా పెద్దగా ప్రమోషన్స్ లేవు. ఈ సిరీస్ కు IMDb కూడా 6.8 రేటింగే ఇచ్చింది.
దీనికి కారణమేంటనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. చాలా నార్మల్ సిరీస్ కు కూడా భారీ ప్రశంసలొస్తున్న ఈ రోజుల్లో కంఖుజారాకు ప్రశంసలు రాకపోవడానికి కారణం మెయిన్ లీడ్ లో నటించిన వ్యక్తి అంతగా ఫేమస్ అవకపోవమేనా అని కొందరంటుంటే, ఈ సిరీస్ కు సదరు ఓటీటీ సంస్థ మినిమం ప్రమోషన్స్ ను కూడా చేయలేదని కొందరంటున్నారు. రీజన్ ఏదైనా సరే కంఖుజారా సిరీస్ కు సరైన గుర్తింపు రాలేదన్నది ఆడియన్స్ గ్రహించాలని అవసరం ఉంది.
