Begin typing your search above and press return to search.

1000 కోట్ల హీరో.. కిరాణం కొట్టులో ఇలా..

అంత పెద్ద హీరో ఒక సాధారణ వ్యక్తిలా ఒక కిరాణం కొట్టుకు వెళ్లి ఏదో కొనుగోలు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాడు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 9:48 AM GMT
1000 కోట్ల హీరో.. కిరాణం కొట్టులో ఇలా..
X

కొంతమంది స్టార్ హీరోలు వారి క్రేజ్ ఎంత పెరిగినా కూడా చాలా సింపుల్ గా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. చిన్న చిన్న విషయాల్లోనే చాలా ఆనందాలు దాగి ఉన్నాయి అని వీలైనంతవరకు ఎంత ఒదిగి ఉంటే అంత ప్రశాంతంగా ఉంటామని కూడా చెబుతూ ఉంటారు. ఇక అదే తరహాలో సింపుల్ జీవితాన్ని కొనసాగించే అతికొద్ది మంది స్టార్స్ లలో యశ్ కూడా ఒకరు. మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన యష్ తండ్రి ఒక బస్సు డ్రైవర్ అని కూడా చాలా మందికి తెలుసు.

హీరోగా మారిన తర్వాత కూడా అతని తండ్రి కొంత కాలం పాటు బస్సు డ్రైవర్ గా పని చేశాడు అని రాజమౌళి కూడా కేజీఎఫ్ సినిమా ఈవెంట్ లో తెలియజేశాడు. ఇక హీరో యశ్ కూడా ఇప్పుడు కేజీఎఫ్ సినిమాతో 1000 కోట్లకు పైగా మార్కెట్ ఉన్న హీరోగా మంచి గుర్తింపు అందుకున్నాడు. అయినప్పటికీ అతను చాలా సింపుల్ గా ఉండేందుకే ఇష్టపడుతూ ఉంటాడు.

తరచుగా ఫ్యాన్స్ అతన్ని కలవడానికి వచ్చినప్పుడు ఇబ్బంది పడకుండా వారిని మీట్ అవుతాడు. అందుకే కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు అతని స్థాయి అమాంతం పెరిగిపోతుంది. అంతే కాకుండా పాన్ ఇండియా రేంజ్ లో కూడా ఇప్పుడు హీరో యశ్ కు అభిమానుల సంఖ్య పెరుగుతుంది. ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హీరోకు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది.

అంత పెద్ద హీరో ఒక సాధారణ వ్యక్తిలా ఒక కిరాణం కొట్టుకు వెళ్లి ఏదో కొనుగోలు చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నాడు. అసలు విషయంలోకి వెళితే అతడి కూతురి కోసం హఠాత్తుగా ఆ కిరణం షాపులోకి వెళ్లి ఒక క్యాండీ చాక్లెట్ కొనడానికి ఆ విధంగా వెళ్ళాడట. సరదాగా కూతురిని తీసుకొని బయటకు వెళ్లిన యశ్ ఈ విధంగా కెమెరా కంట పడ్డాడు. కూతురు అంటే యశ్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

చాలాసార్లు ప్రెస్ మీట్ లలో కూడా తన కూతురుని తీసుకువచ్చాడు. ఫ్యామిలీ అంటే ఎంతో ఎమోషనల్ గా ఫీల్ అయ్యే యశ్ ఏ మాత్రం గ్యాప్ దొరికిన కూడా వారితో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఇక ప్రస్తుతం ఈ హీరో టాక్సిక్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసింది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజిఎఫ్ సిరీస్ కు కొనసాగించే అవకాశం ఉంది.