Begin typing your search above and press return to search.

వీడియో : రాక్‌ స్టార్‌ శృతి దుమ్మురేపింది

సాధారణంగా హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో ఇతర విషయాలపై పెద్దగా ఆసక్తి చూపించరు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 4:40 AM GMT
వీడియో : రాక్‌ స్టార్‌ శృతి దుమ్మురేపింది
X

యూనివర్శిల్ స్టార్‌ కమల్‌ హాసన్‌ మల్టీ ట్యాలెంటెడ్‌ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆయన కూతురు శృతి హాసన్ కూడా ఇప్పటికే మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంది. నటిగా హిందీ సినిమాలతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పాన్ ఇండియా నటిగా దూసుకు పోతుంది. ప్రత్యేక పాటలతో కూడా తన సత్తా చాటింది. మొత్తానికి శృతి హాసన్ ఫుల్ బిజీగా ఉంది.

సాధారణంగా హీరోయిన్ గా బిజీగా ఉన్న సమయంలో ఇతర విషయాలపై పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ శృతి హాసన్ మాత్రం తనకు ఎంతో ఇష్టం అయిన సంగీతాన్ని మాత్రం వదలడం లేదు. హీరోయిన్‌ గా స్టార్‌ హీరోలకు జోడీగా నటిస్తూ కోట్ల పారితోషికం తీసుకుంటూ ఉన్నా కూడా మ్యూజిక్ పై ఆసక్తితో స్టేజ్ షో లు చేస్తూనే ఉంది.

ప్రైవేట్‌ ఆల్బమ్స్ ను రూపొందిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంది. సంగీత దర్శకురాలిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా మెప్పిస్తుంది. తాజాగా GQMOTY ఈవెంట్ లో శృతి హాసన్ రాక్‌ స్టార్‌ అవతారం ఎత్తింది. తన మ్యూజిక్‌ తో పాటు తన గాత్రం తో కూడా మెప్పించింది. శృతి హాసన్‌ స్టేజ్ షో చూసిన హాలీవుడ్ స్టార్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

శృతి హాసన్‌ పాడిన ఇంగ్లీష్ పాట తాలూకు వీడియోను GQMOTY ను అఫిషియల్‌ ట్విట్టర్ హ్యాండిల్‌ లో షేర్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తూ వైరల్ అవుతోంది. శృతి హాసన్ నిజంగా ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు... అంతర్జాతీయ స్థాయి రాక్ స్టార్‌ అంటూ ఆమెను ఫ్యాన్స్ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. వీడియోను మీరు ఒక లుక్కేయండి.

ఇక శృతి హాసన్ సినిమాల విషయానికి వస్తే ఈమె ప్రభాస్‌ తో కలిసి నటించిన సలార్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతే కాకుండా హిందీ మరియు తమిళ భాషల సినిమాల్లో నటిస్తోంది. అంతే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తూ ఉంది. పలు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా, కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇంత బిజీలోనూ స్టేజ్ షో చేయడం ఈమెకే చెల్లిందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.