Begin typing your search above and press return to search.

రాబిన్‌హుడ్‌.. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ మైండ్ బ్లాంక్!

నితిన్ ఇందులో రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నాడు. సాహసోపేతమైన దొంగ పాత్రకు సంబంధించిన లుక్ ని రిలీజ్ చేయ‌గా దానికి అద్భుత స్పంద‌న వచ్చింది.

By:  Tupaki Desk   |   2 March 2024 3:39 AM GMT
రాబిన్‌హుడ్‌.. ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ మైండ్ బ్లాంక్!
X

యూత్ స్టార్ నితిన్ కి 'భీష్మ' లాంటి భారీ హిట్ చిత్రాన్ని అందించిన వెంకీ కుడుముల ఇప్పుడు అత‌డితో మ‌రో చిత్రం రూపొందిస్తున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ మొదటి రెండు సినిమాలతో రెండు బ్లాక్‌బస్టర్‌లను అందుకున్న వెంకీ ఈసారి నితిన్ కోసం పవర్‌ఫుల్ స్క్రిప్ట్‌తో బ‌రిలో దిగాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.

నితిన్ ఇందులో రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో న‌టిస్తున్నాడు. సాహసోపేతమైన దొంగ పాత్రకు సంబంధించిన లుక్ ని రిలీజ్ చేయ‌గా దానికి అద్భుత స్పంద‌న వచ్చింది. ఇది కామెడీ మేళ‌వించిన‌ యాక్షన్-అడ్వెంచర్. నితిన్ ను వెంకీ కుడుముల వినూత్నంగా చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇటీవలే ఆవిష్కరించిన క్యారెక్టర్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. నితిన్ పాత్ర తన అసాధారణమైన యాక్టివిటీస్ తో కావాల్సినంత వినోదాన్ని పంచ‌నుంది.

డైనమిక్ స్టంట్ మాస్ట‌ర్లు రామ్-లక్ష్మణ్ ఇప్ప‌టికే కీల‌క‌మైన‌ ఇంటర్వెల్ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ ని పూర్తి చేస్తున్నారు. ఇటీవల మున్నార్‌లో ఒక షెడ్యూల్‌ను పూర్తి చేసిన మేకర్స్ హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించారు. రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ పర్యవేక్షణలో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ మూవీలో ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంటుంద‌ని చెబుతున్నారు. రాబిన్‌హుడ్‌లో ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ కీలకమైన ఎపిసోడ్ అని కూడా చెబుతున్నారు.

భీష్మ విజయం తరువాత నితిన్ చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజక వర్గం, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి చిత్రాల్లో న‌టించాడు. ఇవ‌న్నీ అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాయి. డిజాస్టర్ లుగా మారాయి. ఫలితంగా నితిన్ తన కెరీర్‌ను తిరిగి ట్రాక్ లోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడ‌ని తెలిసింది.