కోలీవుడ్ మరో కొత్త యూనివర్స్ రాబోతుందా?
కోలీవుడ్ లో సినిమాటిక్ యూనివర్స్‌ల ట్రెండ్ రోజురోజుకూ విస్తరిస్తున్న వేళ, యాక్టర్- డైరెక్టర్ ఆర్జే బాలాజీ చేసిన తాజా కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి.
By: Sravani Lakshmi Srungarapu | 21 Jun 2026 11:29 AM ISTకోలీవుడ్ లో సినిమాటిక్ యూనివర్స్‌ల ట్రెండ్ రోజురోజుకూ విస్తరిస్తున్న వేళ, యాక్టర్- డైరెక్టర్ ఆర్జే బాలాజీ చేసిన తాజా కామెంట్స్ ఇప్పుడు కొత్త చర్చకు తెరలేపాయి. రీసెంట్ గా రిలీజై భారీ సక్సెస్ ను అందుకున్న కరుప్పు సినిమా తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాకుండా, కోలీవుడ్‌లో మరో యూనివర్స్‌కు పునాది పడబోతోందా అనే ఊహాగానాలకు దారితీశాయి.
కరుప్పు సక్సెస్ తర్వాత జరిగిన ఓ ఇంటరాక్షన్‌లో ఆర్జే బాలాజీని కరుప్పు2 ఎప్పుడని ప్రశ్నించగా, దానికి ఆయన చెప్పిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తాను కరుప్పు సక్సెస్ నుంచి ఇంకా పూర్తిగా బయటకు రాలేదని, సీక్వెల్ గురించి ఆలోచించే స్థితిలో లేనని స్పష్టం చేశారు. అయితే ఫ్యూచర్ లో సూర్యతో మళ్లీ కలిసి పనిచేస్తానని చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైన ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది. RJB యూనివర్స్ అనే కాన్సెప్ట్ గురించి మీ ఆలోచన ఏంటని అడగ్గా, ఆర్జే బాలాజీ నవ్వుతూ RJB యూనివర్స్ ఆ? సరే, ఆ యూనివర్స్ గురించి కూడా ఆలోచిస్తా అని సరదాగా స్పందించారు. సాధారణంగా చేసిన ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారింది.
గత కొన్నేళ్లుగా కోలీవుడ్‌లో సినిమాటిక్ యూనివర్స్‌లకు విశేష ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా లోకేష్ కనగరాజ్ రూపొందించిన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(LCU) భారీ విజయాన్ని సాధించడంతో పలువురు డైరెక్టర్లు కూడా కూడా ఇలాంటి కాన్సెప్ట్‌లపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జే బాలాజీ చేసిన కామెంట్స్ అభిమానుల్లో కొత్త అంచనాలకు కారణమయ్యాయి. ప్రస్తుతం కరుప్పు2 ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేకపోయినా, సూర్య- ఆర్జే బాలాజీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో RJB యూనివర్స్ పై చేసిన కామెంట్స్ కూడా అభిమానుల ఊహాశక్తికి మరింత పదును పెట్టాయి.
అయితే వాస్తవానికి ఆర్జే బాలాజీ చేసిన కామెంట్స్ పూర్తిగా సరదాగానే ఉన్నప్పటికీ, ఆయన తర్వాతి ప్రాజెక్టులపై ఆసక్తి పెరగడానికి అవి కారణమయ్యాయి. కరుప్పు సక్సెస్‌తో ఇప్పటికే మంచి ఫామ్‌లో ఉన్న ఆయన, ఫ్యూచర్‌లో ఎలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తారనే అంశం ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చగా మారింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలు గానే మిగిలినా, ఒక చిన్న కామెంట్‌తోనే కొత్త యూనివర్స్ డిస్కషన్ ను మొదలు పెట్టగలిగిన ఆర్జే బాలాజీ ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా నిలిచారు.
