Begin typing your search above and press return to search.

వోర చూపుల‌తో వ‌లపు బాణాలు విసురుతోంది

ఇప్పుడు మ‌రో త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేసి హీటెక్కిస్తోంది. రియా ఈసారి కూడా బికినీలో ప్ర‌త్య‌క్ష‌మైంది.

By:  Tupaki Desk   |   2 Sep 2023 12:30 AM GMT
వోర చూపుల‌తో వ‌లపు బాణాలు విసురుతోంది
X

ఆమె వ‌ల‌కు చిక్కారో చేప పిల్ల‌లా గిజ‌గిజ‌లాడ‌తారు.. ఆపై ఏం చేసినా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. క్రీగంటి చూపుల‌తో కుర్ర‌కారు గుండెల్లో గుచ్చేస్తున్న ఈ బ్యూటీ ఎవ‌రో ప్రత్యేకించి ప‌రిచ‌యం చేయాలా? ఇప్ప‌టికే సుప‌రిచిత‌మైన రియా సేన్ కి ఇటు తెలుగు యూత్ లోను అంతో ఇంతో ఫాలోయింగ్ ఉంది. నేను మీకు తెలుసా? చిత్రంలో మంచు మ‌నోజ్ స‌ర‌స‌న న‌టించిన రియా ఆ సినిమా ఫ్లాప‌వ్వ‌డంతో టాలీవుడ్ లో అంత‌గా పాపుల‌ర్ కాలేక‌పోయింది. ఆ త‌ర్వాత కూడా ఇక్క‌డ ప్ర‌య‌త్నించిన దాఖ‌లాలు లేవు.


హిందీ చిత్ర‌సీమ‌లో మాత్రం త‌న‌వంతు ప్ర‌యత్నాల‌తో నిరంత‌రం అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది. రియాసేన్ పాపుల‌ర్ హీరోయిన్ మున్ మున్ సేన్ కుమార్తె. న‌ట‌వార‌సురాలిగా రంగ ప్ర‌వేశం చేసింది. బాలీవుడ్ లో ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించింది. కానీ ఇటీవ‌లి కాలంలో న‌వ‌త‌రం క‌థానాయిక‌ల వెల్లువ‌లో రియా కెరీర్ ప‌రంగా రేసులో వెన‌క‌బ‌డింది.

2022లో ల‌వ్ యు హ‌మేషా అనే చిత్రంలో న‌టించిన రియా 2023లో 'డెత్ టేల్' అనే చిత్రానికి మాత్ర‌మే సంత‌కం చేసింది. ఏడాదికి కనీసం ఒక సినిమాలో న‌టించ‌డం కూడా క‌ష్టంగా మారింది. ఇక ఈ భామ వెబ్ సిరీస్ ల‌లో న‌టించే ప్ర‌య‌త్నం చేసినా వాటికి ఆశించినంత మైలేజ్ రాక‌పోవ‌డం మైన‌స్ గా మారింది. రాగిణి ఎంఎంఎస్ రిట‌ర్న్స్ లాంటి ఘాటైన రొమాంటిక్ వెబ్ సిరీస్ తో రియాకు కొంత అడ‌ల్ట్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఐషా- పాయిజ‌న్ - మిస్ మ్యాచ్ 2- ప‌తి ప‌త్ని ఔర్ వో వంటి వెబ్ సిరీస్ ల‌లో న‌టించింది. కానీ ఇవేవీ త‌న రేంజును పెంచడానికి ఉప‌యోగ‌ప‌డ‌లేదు. క‌నీసం అదా శ‌ర్మ‌కు కేర‌ళ స్టోరి లాంటి ఒక బ్లాక్ బ‌స్ట‌ర్ అయినా ద‌క్కింది. కానీ రియాకు అలాంటి ఒక్క ఛాన్స్ కూడా ద‌క్క‌క‌పోవ‌డం దుర‌దృష్టం అని చెప్పాలి.

ఇక‌పోతే సోష‌ల్ మీడియా పోస్టింగుల‌తో రియా బాగానే అభిమానుల్ని సంపాదించుకుంది. ఇంత‌కుముందు బాలీ వేకేష‌న్ నుంచి వ‌రుస ఫోటోషూట్ల‌ను షేర్ చేసి వేడిపెంచింది. ఇప్పుడు మ‌రో త్రోబ్యాక్ ఫోటోని షేర్ చేసి హీటెక్కిస్తోంది. రియా ఈసారి కూడా బికినీలో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఆ అంద‌మైన క‌ళ్లు అర‌విసిరిన అందాలు యువ‌త‌రానికి మ‌త్తెక్కిస్తున్నాయి. వోర చూపుల‌తో వ‌ల‌పు బాణాలు విసురుతున్న ఈ బ్యూటీకి ఫిదా అయిపోతోంది యూత్. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది. రియా ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మైతే మ‌రోసారి బెంగాళీ- హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో అవ‌కాశాలు పెరుగుతాయ‌నే భావిద్దాం.