మామ్ ధైర్యంతో ఇండస్ట్రీకి రీతూవర్మ!
సినిమా ఇండస్ట్రీకి కుమార్తెలను పంపిచాలంటే ఏతల్లైనా ఎంతో ఆలోచిస్తుంది. అందులోనూ తెలుగమ్మాయిలు రావాలంటే? మరింత ఆలోచిస్తారు.
By: Tupaki Desk | 14 May 2025 7:30 PMసినిమా ఇండస్ట్రీకి కుమార్తెలను పంపిచాలంటే ఏతల్లైనా ఎంతో ఆలోచిస్తుంది. అందులోనూ తెలుగమ్మాయిలు రావాలంటే? మరింత ఆలోచిస్తారు. ఇండస్ట్రీ గురించి తమకున్న పరిజ్ఞానం మేరకు ఏ తల్లైనా వద్దే అంటుంది. ఎన్ని కోట్లు సంపాదించినా? సినిమా నటులు అంటే ఎక్కడో చిన్న చూపు అన్న అపవాదు ఎప్పటి నుంచే ఉంది. ఈ విషయాన్ని ఎన్నో సినిమాల్లో ఎంతో మంది ఓ పెన్ గానే చెప్పారు.
పూరి జగన్నాధ్ తన సినిమా లో పాట ద్వారా కూడా చెప్పే ప్రయత్నం చేసారు. సినీ పరిశ్రమ ఎంత వృద్దిలోకి వచ్చినా? ఇప్పటికే తెలుగింట అమ్మాయిల్నిసినిమాల్లోకి పంపించాలంటే? ఎంతో ఆలోచిస్తారు. అయితే రీతూ వర్మ మామ్ మాత్రం అందుకున్న భిన్నం. తమ కుటుంబమంతా ఉన్నత విద్యావంతులే. అందరూ ఇంజ నీర్లు..డాక్టర్లు. రీతూవర్మ సినిమాల్లోకి వెళ్తానంటే అంతా విచిత్రంగా భావించారట.
కానీ తన తల్లి మాత్రం ధైర్యంగా వెళ్లి ఓ ప్రయత్నం చేయ్ అని ప్రోత్సహించిందట. అలా అమ్మ సహకారంతో రీతూ వర్మ సినిమాల్లోకి వచ్చినట్లు తెలిపింది. అమ్మ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఇప్పటికీ అలాగే కాపాడుకుంటూ వస్తున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో జరిగే ప్రతీ విషయాన్ని అమ్మతో పంచుకుంటుందట. ఇండస్ట్రీలో సమస్యలు ఎదురైనా వాటి గురించి మామ్ కి చప్పగానే వాటికి పరిష్కారం కూడా చెప్పేవారంది.
మామ్ సంగీతా వర్మ సొంతంగా ఓ స్కూల్ రన్ చేస్తున్నారట. ప్రోఫెషనల్ గా ఎంతో బిజీగా ఉన్నా తనకు మాత్రం ఎలాంటి లోటు లేకుండానే చూసుకుంటారని తెలిపింది. రీతూవర్మ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటుంది. అలాగే లిప్ లాక్ సన్నివేశాల్లోనూ అమ్మడు నటించదని తెలిసిందే.