పిక్‌టాక్ : బీచ్‌లో చిల్ అవుతున్న అందాల రీతూ
తాజాగా ఈ అమ్మడు బీచ్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Tupaki Desk | 9 Jun 2025 12:35 PMఎన్టీఆర్ 'బాద్షా' సినిమా చిన్న పాత్రలో నటించిన రీతూ వర్మ ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయి కావడంతో టాలీవుడ్ ఈ అమ్మడిని ఆశించిన స్థాయిలో ఆధరించలేదు. ప్రేక్షకులు ఈమెను ఆదరిస్తూ ఉన్నా కూడా ఇండస్ట్రీ వర్గాల వారు మాత్రం ఈమెకు తగ్గ పాత్రలు ఇవ్వలేదు. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు ఈమెను హీరోయిన్గా కనీసం కన్సిడర్ చేయలేదు. అందుకే ఈ అమ్మడు చేసిన సినిమాలు అన్నీ కూడా చిన్నవి, మీడియం బడ్జెట్ సినిమాలు అనే విషయం తెల్సిందే. పెళ్లి చూపులు సినిమాలో హీరోయిన్గా నటించడం ద్వారా రీతూ వర్మకు మంచి గుర్తింపు దక్కింది.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన రీతూ వర్మ నటనపై ఆసక్తితో అందాల పోటీల్లో పాల్గొంది. విల్లా మేరీ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి ఇంటర్ పూర్తి చేసిన ఈ అమ్మడు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్‌లో ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో నిర్వహించిన బ్యూటీ పోటీల్లో పాల్గొంది. అంతే కాకుండా మోడలింగ్‌లోనూ ఈ అమ్మడు ఆకట్టుకుంది. నటనపై ఆసక్తితో డాన్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ప్రతిభ ఉన్న నటి కావడంతో ఈమెకు మంచి ఫ్యూచర్ ఉంటుందని అంతా భావించారు. కానీ ఈ అమ్మడికి అంతగా ఆఫర్లు రాలేదు. ముఖ్యంగా ఈ అమ్మడికి పెద్ద సినిమాల్లో ఛాన్స్ దక్కలేదు.
తెలుగులో ఆఫర్లు దక్కక పోవడంతో ఇతర భాషల్లోనూ ఈమె ప్రయత్నాలు చేసింది. తమిళ్లో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ఇతర భాషల్లో నటించాలని భావించింది. తమిళ్లో మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ తెలుగులో ఈమె చేసిన పాత్రలు గుర్తింపు తెచ్చి పెట్టలేదు. ఈ ఏడాదిలో మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అంతకు ముందు స్వాగ్ సినిమాలోనూ ఈమె నటించి మెప్పించింది. తమిళ్లో ఈమె చేసిన మార్క్ ఆంటోనీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కుతున్నా అదృష్టం కలిసి రాకపోవడంతో స్టార్ డం దక్కడం లేదు. తెలుగులో ఈ అమ్మడు స్టార్ హీరోల సినిమాల్లో నటించడం కోసం వెయిట్ చేస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా అందాల ప్రదర్శణ చేస్తూ అలరిస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు బీచ్ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. కాన్స్టాన్స్ లెమురియా ప్రస్లిన్ సీషెల్స్ ప్రాంతంలో తీసుకున్న ఈ అమ్మడి ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బీచ్‌లో చిల్ అవుతున్న ఈ అమ్మడి ఫోటోలు చాలా కూల్‌గా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి అంటూ అభిమానులతో పాటు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అందాల రీతూ ఎప్పటిలాగే ఈ సినిమాతోనూ మెప్పిస్తుంది. మరి ముందు ముందు అయినా ఈఅమ్మడికి ఆఫర్లు మరిన్ని వస్తాయా అనేది చూడాలి.