Begin typing your search above and press return to search.

మాకు చెమ‌ట‌లు ప‌ట్టించావ్ క‌దా రితిక‌

జిమ్ లో చెమ‌ట‌లు ప‌ట్టేలా వ‌ర్కౌట్ చేయ‌డం అంద‌రికీ సాధ్యం కాదు. ఎంతో క‌ఠోరంగా శ్ర‌మిస్తేనే స్వేదం శ‌రీర‌మంతా కారుతుంది.

By:  Tupaki Desk   |   14 Nov 2023 6:07 AM GMT
మాకు చెమ‌ట‌లు ప‌ట్టించావ్ క‌దా రితిక‌
X

జిమ్ లో చెమ‌ట‌లు ప‌ట్టేలా వ‌ర్కౌట్ చేయ‌డం అంద‌రికీ సాధ్యం కాదు. ఎంతో క‌ఠోరంగా శ్ర‌మిస్తేనే స్వేదం శ‌రీర‌మంతా కారుతుంది. అందుకోసం కొన్ని గంట‌ల పాటు నిర్వారామంగా వ‌ర్కౌట్లు చేయాలి. అందులోనూ హీరోయిన్లు చెమ‌ట‌లు ప‌ట్టేలా చేయ‌డం అన్న‌ది కొంద‌రికే సాద్యం. సౌత్ లో ఆ రేంజ్ లో వ‌ర్కౌట్లు చేసే భామ‌లు చాలా త‌క్కువ మందే ఉన్నారు. అందులో ముందుండే భామ ఎవ‌రంటే? హాట్ బ్యూటీ రితికా సింగ్ అని చెప్పాలి.


అమ్మ‌డు బేసిక్ గానే స్పోర్స్ట్ ఉమెన్. మిక్సుడ్ మార్ష‌ల్ ఆర్స్ట్ ఆరితేరిన బ్యూటీ. న‌టి అయినా ఇప్ప‌టికీ మార్ష‌ల్ ఆర్స్ట్ ని విడిచిపెట్ట‌లేదు. రోజులో కొంత స‌మ‌యాన్ని ప్రాక్టీస్ కి కేటాయిస్తుంది. అలాగే జిమ్ములో వ‌ర్కౌట్లు చేస్తుంది. యోగా సాధాన‌లు లాంటివి బ్యూటీకి పెద్ద‌గా ప‌డ‌వు గానీ క‌ఠోరంగా శ్ర‌మించ‌మంటే? మాత్రం చాలా మెండిగా ముందుకెళ్లిపోతుంది. తాజాగా అలాంటి వీడియో ఒక‌టి పోస్ట్ చేసి వావ్ అనిపించింది.

జిమ్ములో వ‌ర్కౌట్లు అనంత‌రం ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో అమ్మ‌డికి ఒళ్లంతా చెమ‌ట‌లు క‌క్కుతూ క‌నిపించింది. ఊపిరి కూడా తీసుకోకుండా వ‌ర్కౌట్లు చేసింది. అందుకే అలా గ‌ట్టిగా ఊపిరి తీసుకుంటూ రిలాక్స్ అవుతుంది. ముఖం నుంచి శ‌రీర‌మంతా స్వేదం కారుతూనే ఉంది. వేసుకున్న బ‌నియ‌ర్ మొత్తం చెమ‌ట‌తో త‌డిసి ముద్దైపోయింది. పిండితే లీట‌ర్ ఉప్పు నీరు వ‌చ్చేలా ఉంది.

ఆ రేంజ్ లో రితికా వ‌ర్కౌట్లు చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఆమ్మ‌డు డెడికేష‌న్ చూసి షాక్ అవుతున్నారు కుర్రాళ్లంతా. మాకే సాధ్యం కాలేదు..నీకెలాసాధ్య‌మైంది? క‌మిట్ మెంట్ ..డెడికేష‌న్ అంటే ఇదీ అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. త‌న‌లో ఈ క‌ష్ట‌ప‌డే త‌త్వాన్ని చూసే సుధ కొంగ‌ర `గుర` చిత్రంలో బాక్సార్ పాత్ర‌లో న‌టించే అవ‌కాశం క‌ల్పించారు. ప్ర‌స్తుతం రితిక వివిధ భాష‌ల్లో ప‌లు సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.