పిక్‌టాక్ : ఈ అమ్మడిది ఏం అందం గురూ
ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న రితికా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది.
By: Tupaki Desk | 18 Jun 2025 10:30 PM ISTతెలుగు ప్రేక్షకుల ముందుకు 'గురు' సినిమాతో వచ్చిన ముద్దుగుమ్మ రితికా మోహన్ సింగ్. ఈ అమ్మడు నటి మాత్రమే కాకుండా మార్షన్ ఆర్ట్స్‌లో ప్రావిణ్యం పొందింది. సాధారణంగా హీరోయిన్స్ చాలా సున్నితంగా ఉంటారు అంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ చాలా రఫ్‌గా ఉంటుంది. ఈమె నటించిన గురు సినిమాతోనే ఆ విషయం అర్థం అవుతుంది. తెలుగులో ఈమె చేసిన సినిమాలు తక్కువే అయినా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. గురు సినిమా తర్వాత తెలుగులో ఈమె నీవెవరో సినిమాలో నటించింది. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. వళరి అనే తెలుగు సినిమాలో కూడా ఈమె నటించింది. కానీ అవి పెద్దగా విజయాన్ని సొంతం చేసుకోలేదు. దాంతో తెలుగులో ఈమెకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు.
రితికా తెలుగులో ఆఫర్లు రాకున్నా హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం అవుతున్నప్పటికీ ఈ అమ్మడు చేసిన సినిమాలు చాలా తక్కువ. అయితే చేసిన ప్రతి సినిమాలోనూ తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సూపర్ హిట్ సినిమాలు చేయాలని కోరుకుంటుంది. కానీ ఈమెకు అందుకు తగ్గట్లుగా ఆఫర్లు రావడం లేదు. తెలుగులో ఇక మీదట ఈమెకు ఆఫర్లు వస్తాయా అనేది అనుమానమే అనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. దాదాపుగా 50 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈమె రెగ్యులర్‌గా అందమైన ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా తన అందమైన ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న రితికా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్ చేసింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అని ఈ ఫోటోలు చూస్తే అనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సాధారణంగా మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావిణ్యం ఉన్న వారు ఫిజిక్ పరంగా అందంగా ఉండరు అనే అభిప్రాయం ఉంటుంది. కానీ ఈ అమ్మడు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావిణ్యం ఉన్నప్పటికీ ఫిజికల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటూనే అందాల ఆరబోత చేస్తూ అందరిని ఆకట్టుకుంది. ఈ అమ్మడి యొక్క అందం ఎంతో మంది స్టార్ హీరోయిన్స్‌తో పోల్చితే బెటర్ అనే కామెంట్స్ వస్తున్నాయి.
చిన్నప్పటి నుంచి కిక్ బాక్సర్‌గా, మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందిన రితికా సూపర్ ఫైట్ లీగ్ ప్రారంభ సీజన్‌లో కనిపించింది. అంతే కాకుండా మిక్స్‌డ్ మార్షల్ ఆర్టిస్ట్‌గానూ పోటీ పడింది. ఎన్నో స్టేజీలపై ప్రదర్శన ఇచ్చిన రితికా సింగ్ 2009లో ఆడియాలో జరిగిన ఇండోర్ క్రీడల్లో భారతదేశం తరపున పాల్గొంది. సుధ కొంగర తమిళ చిత్రం ఇరుధి సుట్రు లో మాధవన్‌తో కలిసి నటించింది. తమిళ్‌లో మాత్రమే కాకుండా ఇతర భాషల్లోనూ ఈమె నటించింది. మూడు సార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది. అంతే కాకుండా జాతీయ అవార్డు, సైమా అవార్డు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డును సైతం దక్కించుకుంది.
