Begin typing your search above and press return to search.

భార్యాభ‌ర్త‌ల క‌ల సాకార‌మ‌య్యే వేళ‌!

బాలీవుడ్ ఆద‌ర్శ దంప‌తులుగా వెలిగిపోతున్న‌ రితీష్ దేశ్ ముఖ్-జెనిలియా జోడీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.

By:  Tupaki Desk   |   20 Feb 2024 6:05 AM GMT
భార్యాభ‌ర్త‌ల క‌ల సాకార‌మ‌య్యే వేళ‌!
X

బాలీవుడ్ ఆద‌ర్శ దంప‌తులుగా వెలిగిపోతున్న‌ రితీష్ దేశ్ ముఖ్-జెనిలియా జోడీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఇద్ద‌రు పిల్ల‌ల‌తో ఈ జోడీ నెట్టింట ఎప్పుడూ హల్చ‌ల్ చేస్తుంటుంది. చూడ‌ముచ్చ‌టైన కుటుం బాన్ని చూస్తూ అభిమానులు ఎంతో మురిసిపోతుంటారు. ఇద్ద‌రు ప్రేమించి పెళ్లి చేసుకుని ఎంత సంతో షంగా ఉన్నార‌ని అంతా సంబ‌ర ప‌డిపోతుంటారు. వివాహం త‌ర్వాత జెనిలియా కూడా అంతే సెల‌క్టివ్ గా ఉంటుంది.


బాలీవుడ్ క‌ల్చ‌ర్ లో ఉన్నా ఎంతో హుందాగా న‌డుచుకుంటుంది. భ‌ర్త కొరిక‌లనే త‌న కొరిక‌లు గా మ‌లుచుకుని జీవితంలో మ‌రింత సంతోషంగా క‌నిపిస్తుంది. రితేష్ దేశేముఖ్ శివాజీ మ‌హ‌రాజ్ క‌థ‌ని చాలా కాలంగా తెర‌కెక్కించాల‌నుకుంటున్నారు. ఆ ర‌క‌మైన ప్ర‌య‌త్నాలు చాలాసార్లు చేసారు. కానీ ఏదో ఆట‌కంతో ఆగిపోయేది. కానీ ఈసారి మాత్రం ఆ ఛాన్సే లేకుండా ఈ చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ఈ చిత్రాన్ని నిర్మించ డానికి జెనిలియా ముందుకొచ్చింది.

భ‌ర్త డ్రీమ్ ప్రాజెక్ట్ లో తాను కీల‌క భాగ‌స్వామిన‌ని..ఇది త‌న‌కు డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిదేన‌ని చెప్పుకొచ్చింది. ఇది ఎన్నో ఏళ్ల నాటి కల ఇప్పుడు సాకారం కాబోతుంది. సినిమా నిర్మించ‌డం గౌర‌వంగా కాకుండా బాధ్య‌త తీసుకుంటున్నామ‌న్నారు. ఈ ప్ర‌యాణంలో అంద‌ర్నీ ఆశీస్సులు కావాల‌ని జెనిలియా కోరింది. ఇప్ప‌టికే అమ్మ‌డు నిర్మాత‌గా స‌త్తా చాటిన సంగ‌తి తెలిసిందే. `మౌలీ`..`వేద్` అనే మ‌రాఠీ చిత్రాల్ని జెనిలియా స్వ‌యంగా నిర్మించింది.

వాటిలో కీల‌క‌మైన పాత్ర‌లు పోషించింది. ఆ ర‌కంగా రెండు సినిమాల‌తో రెండు ర‌కాల అనుభ‌వం సంపా దించింది. మ‌రి భ‌ర్త ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న తాజా సినిమాలో జెనిలియా ఏదైనా పాత్ర పోషిస్తుందా? లేక నిర్మాత‌గానే స‌రిపెట్టుకుంటుందా? అన్న‌ది తెలియాలి. భ‌ర్త డ్రీమ్ ప్రాజెక్ట్ కాబ‌ట్టి జెన్నీ ఏదైనా పాత్ర పోషిస్తే బాగుంటుంద‌ని అభిమానుల నుంచి అభ్య‌ర్ధ‌న‌లైతే వెళ్తున్నాయి.