Begin typing your search above and press return to search.

సీక్వెల్ కోసం విలన్‌ గా మారబోతున్న హీరో!

అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించబోతున్న రైడ్‌ 2 సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది.

By:  Tupaki Desk   |   14 Jan 2024 12:30 AM GMT
సీక్వెల్ కోసం విలన్‌ గా మారబోతున్న హీరో!
X

బాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో హీరోలు కొన్నాళ్ల తర్వాత విలన్‌ పాత్రల్లో లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగానో నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో అలాంటి విలన్ లు చాలా మంది పుట్టుకు వచ్చారు. సంజయ్ దత్ మొదలుకుని బాబీ డియోల్ వరకు చాలా మంది విలన్స్‌ గా మారారు.

మరో హీరో కూడా విలన్ గా మారేందుకు రెడీ అయ్యాడు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన బొమ్మరిల్లు జెనీలియా భర్త అయిన రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఇప్పటి వరకు హీరోగా నటిస్తూ హిందీలో మంచి ఫాలోయింగ్ ను దక్కించుకున్నాడు. అయితే హీరోగా ఈ మధ్య కాలంలో కాస్త స్లో అయ్యాడు.

ఒక వైపు హీరోగా చేస్తూనే మరో వైపు విలన్‌ గా చేయడం ద్వారా ఎక్కువ పాపులారిటీ లభించడంతో పాటు మంచి ఆఫర్లు వస్తాయి అనే ఉద్దేశ్యంతో రితేష్ దేశ్‌ముఖ్‌ విలన్ గా నటించేందుకు సిద్ధం అయ్యాడని తెలుస్తోంది. సూపర్‌ హిట్‌ మూవీ రైడ్‌ సీక్వెల్‌ లో ఈ హీరో విలన్ వేషం తో మెప్పించబోతున్నాడు.

అజయ్‌ దేవగన్‌ హీరోగా నటించబోతున్న రైడ్‌ 2 సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన తాజాగా వచ్చింది. ఇంకా షూటింగ్ ప్రారంభం అవ్వని ఈ సినిమాకు సంబంధించిన నటీ నటుల ఎంపిక జరుగుతుందని, విలన్ పాత్రకు రితేష్‌ ను ఫైనల్ చేశారని సమాచారం అందుతోంది.

హీరోగా ఎన్నో పాత్రల్లో నటించిన రితేష్ గతంలో నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలను చేయడం జరిగింది. కానీ పూర్తి స్థాయి విలన్ గా మాత్రం నటించడం ఇదే ప్రథమం. కనుక రితేష్ కి ఇది కెరీర్‌ టర్నింగ్‌ పాయింట్ గా నిలుస్తుందా అనేది చూడాలి.